E-Paper
Advertisement

Fire accident A manufacturing company: యాదాద్రి జిల్లాలో అగ్ని ప్రమాదం, ఓ కంపెనీలో మంటలు, కాకపోతే..

Fire accident A manufacturing company: యాదాద్రి జిల్లాలో అగ్ని ప్రమాదం, ఓ కంపెనీలో మంటలు, కాకపోతే..
Advertisement

Fire accident A manufacturing company: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. విత్తనాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసే  కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా ఆ కంపెనీని చుట్టుముట్టడంతో స్థానికులు ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు.

రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు, అధికారులు ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే షార్ట్ సర్క్యూట్  కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు అంచనా. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఎంత సరకు కాలిపోయింది, ఎంత డ్యామేజ్ అయ్యిందనేది తెలియాల్సివుంది. దేనికి సంబంధించిన విత్తనాలు అనేది కూడా తెలియాల్సివుంది.

Advertisement

ఘటన విషయం తెలియగానే కంపెనీకి సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. ఉన్నట్లుండి తెల్లవారుజామున సమయంలో షార్ట్ సర్క్యూట్ జరగడం ఏంటన్నది అసలు ప్రశ్న. కావాలనే ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? ఇలా అనేక అనుమానాలు మొదలయ్యాయి. మరి అధికారుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

 

Advertisement

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×