E-Paper
Advertisement

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?
Advertisement

Rice Prices: స్వేచ్చ బ్యూరో: ఇటీవల అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో నిత్యవసరాల ధరలు పెరిగి ఇప్పటికే సామాన్యులకు బతుకు భారంగా మారగా రైస్ మిల్లర్లు దశలవారీగా కొద్ది నెలల కాలంలో వివిధ రకాల సన్నబియానికి క్వింటాళ్లకు రూ. 600 నుంచి రూ. 900 వరకు ధరలు పెంచడం గత నెల నుంచి ఆ ధరలు అమల్లోకి వచ్చాయి. వడ్ల కొనుగోలు సమయంలో పచ్చ గింజ, తేమ ఇతర సాకులతో మద్దతు ధరకు తక్కువకు కొనుగోలు చేస్తూ రైతన్నలను నిలువునా దోపిడీ చేసే మిల్లర్లు వంట గ్యాస్ పూర్తిస్థాయిలో లభించక హోటల్స్, రెస్టారెంట్ల వ్యాపారులు ధరలు పెంచగా అందుబాటులో టన్నుల కొద్ది బియ్యం స్టాక్ ఉన్నప్పటికీ మిల్లర్లు బియ్యం ధరలను క్రమంగా పెంచడం గమనార్హం.

మిల్లింగ్ సామర్థ్యానికి మించి స్టాక్

నల్గొండ జిల్లా వ్యాప్తంగా హాలియా, మిర్యాలగూడ, వేములపల్లి మండలాల పరిధితోపాటు నల్గొండ నియోజకవర్గంలో రైస్ మిల్లులు ఉన్నాయి. కాగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అత్యాధునిక రైస్ మిల్లుల నుంచి భారీగా రైస్ ప్రొడక్షన్ జరుగుతోంది. తాజాగా ముగిసిన రబీ సీజన్ లో మిర్యాలగూడ ప్రాంత మిల్లర్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వచ్చిన దిగుబడిలో 6 నుంచి 7 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. అయితే ఇవి కాకుండా ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి వడ్లను కొనుగోలు చేసి భారీగా స్టాక్ చేశారు. అయితే కొంతమంది మిల్లర్లు తమ రైస్ మిల్లులో మిల్లింగ్ సామర్థ్యానికి మించి భారీగా ధాన్యం, బియ్యం స్టాక్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

ఎలినినో ఎఫెక్ట్ మరింత పెరగనున్న బియ్యం ధరలు

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ సహా ఇతర ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీ దశకు చేరుకోగా కేవలం తాగునీటి కష్టాలు తలెత్తకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖరీఫ్ సాగు ముందుకు సాగకపోవడం ఇదే అదునుగా రైస్ మిల్లర్లు పాత, కొత్త బియ్యం ధరలను మరింత పెంచే పరిస్థితి కనిపిస్తోంది. లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు బ్లాక్ చేసి ఎలినినో కరువు పరిస్థితులను కాసులుగా మార్చుకునే పరిస్థితి రానుంది. సివిల్ సప్లై అధికారులు బియ్యం స్టాక్, ఎగుమతులు ఇతర అంశాలపై దృష్టి సారించి బియ్యం కొరతను సాకుగా చూపి మిల్లర్లు బియ్యం ధరలు పెంచే ప్రయత్నాన్ని నియంత్రించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుత ధరలు

Advertisement

బీపీటీ ఓల్డ్ స్టాక్ క్వింటాళ్లకు రూ. 5 వేలు ఉండగా రూ. 5600 లకు పెంచారు. కొత్తవి క్వింటాళ్లకు 4 వేల నుంచి 5 వేలు, అదేవిధంగా జేఎస్ ఆర్ రకం ఓల్డ్ స్టాక్ రూ. 6500 నుంచి రూ. 7 వేలకు ధర పెంచి అమ్ముతుండగా కొత్తవి రూ. 5200 నుంచి రూ. 6100 క్వింటాళ్లకు రూ. 900 పెంచి విక్రయిస్తున్నారు. హెచ్ఎంటి ఓల్డ్ క్వింటాళ్లకు రూ. 6 వేల నుంచి 6200 పెంచి అమ్మేస్తుండగా కొత్తవి 4500 నుంచి రూ. 5200 లకు విక్రయిస్తున్నారు. ఆర్ఎన్ఆర్ రకం బియ్యం ఓల్డ్ రూ. 7 వేలకు, కొత్తవి రూ. 5700 లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం 30 నుంచి 40 శాతం పక్కదారి పడుతుండగా ఇటు అక్రమ రేషన్ బియ్యం రవాణాను… అడ్డగోలుగా పెరుగుతున్న సన్న బియ్యం ధరలను సివిల్ సప్లై అధికారులు నియంత్రించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Also read: KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×