E-Paper
Advertisement

కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!

కుషాయిగూడలో రైతుల ధర్నా.. న్యాయం చేయాలని డిమాండ్..!
Advertisement

Farmers Protest: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు కుషాయిగూడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ పేరుతో తమకు సంబంధించిన సుమారు రూ.250 కోట్ల నష్టపరిహారం డబ్బులు మోసపూరితంగా కొల్లగొట్టారని ఆరోపించారు.సుమారు 25 గ్రామాలకు చెందిన వందలాది మంది బాధిత రైతులు కుషాయిగూడ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి తమ డబ్బులు దోచుకున్నారని రైతులు తెలిపారు.

Also Read: వేగంగా ధాన్యం సేకరణ.. రైతు ముంగిటకే కొనుగోలు వ్యవస్థ, స్టీఫెన్ రవీంద్ర పరిశీలన

న్యాయం చేయాలని డిమాండ్..

Advertisement

ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, నిందితుల ఆస్తులను జప్తు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావంగా పాశం యాదగిరి మద్దతు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, భూములు కోల్పోయిన రైతులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Also read: దుర్గమ్మ సన్నిధిలో రంభ..రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×