E-Paper
Advertisement

Hyderabad: 9999 నెంబర్ కోసం రూ.21 లక్షలు.. వేలంలో ఫ్యాన్సీ రేటు..

Hyderabad: 9999 నెంబర్ కోసం రూ.21 లక్షలు.. వేలంలో ఫ్యాన్సీ రేటు..
Advertisement
9999 number plate

Hyderabad: పెద్ద ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచీ ఆ నెంబర్ అంటే ఫుల్ క్రేజీ. ఎన్టీఆర్‌కు 9 లక్కీ నెంబర్. అందుకే ఆయన వాహనాలకు 9999 నెంబర్ ఉండేది. అదే అలవాటును జూనియర్ ఎన్టీఆర్ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. తారక్‌కు ఉన్న ప్రతీ కారుకూ 9999 నెంబరే ఉంటుంది. ఎంత ఖర్చు చేసైనా.. రవాణా శాఖ నిర్వహించే ఫ్యాన్సీ నెంబర్ వేలంలో 9999 ను సొంతం చేసుకునేవారు. ఎన్టీఆర్ అనే కాదు.. చాలామందికి 9 లక్కీ నెంబర్‌గా ఉంటుంది. లక్కీ నెంబర్ కాకపోయినా.. అదో ఫ్యాన్సీ నెంబర్. తమ కారుకు 9999 నెంబర్ ఉందంటే.. అదో స్టేటస్ సింబల్. అందుకే, ప్రతీసారీ యాక్షన్‌లో ఆ నెంబర్‌కు ఫుల్ డిమాండ్. ఈసారి కూడా అలానే జరిగింది.

తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన వేలంలో TS 09 GC 9999 నెంబర్‌ను ఏకంగా రూ.21,60,000లకు సొంతం చేసుకున్నారు. ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ నెంబర్‌ కోసం ఇంత మొత్తాన్ని చెల్లించింది.

Advertisement

TS 09 GD 0009 నెంబర్ సైతం మంచి ధరే పలికింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్స్ సంస్థ 10 లక్షల 50 వేలకు ఈ నెంబర్ చేజిక్కించుకుంది.

TS 09 GD 0001కు రూ.3,01,000.. TS 09 GD 0006కు రూ.1,83,000.. TS 09 GD 0045 నెంబర్‌కు రూ.1,55,000.. TS 09 GD 0007కు రూ.1,30,000.. TS 09 GD 0027కు అత్యల్పంగా వేలం పాటలో రూ.1,04,999 ధర పలికింది.

Advertisement

మొత్తంగా ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో తెలంగాణ రవాణాశాఖకు ఒక్కరోజే ఏకంగా రూ.53,34,894ల భారీ ఆదాయం వచ్చింది. కోట్లు పెట్టి లగ్జరీ కార్లు కొనేవాళ్లు.. ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈమాత్రం ఖర్చు చేయడం కామనే అంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×