E-Paper
Advertisement

Family Death: భార్య, భర్త, తల్లి.. ఒకరి కోసం ఒకరు మృతి..

Family Death: భార్య, భర్త, తల్లి.. ఒకరి కోసం ఒకరు మృతి..
Advertisement

Advertisement

Family Death: వరుస మరణాలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త తనువు చాలించాడు. కుమారుడి మరణం తాళలేక తల్లి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో చోటుచేసుకుంది.

వివాహమైన 4 నెలలకే భార్య తన పుట్టింటి దగ్గర ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే ప్రదేశంలో సరిగా పెళ్లి రోజుకు ముందు భర్త శ్యాంసుందర్‌ ప్రాణాలు తీసుకున్నాడు. భార్యాభర్తలు కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. పుట్టింటికి వచ్చిన శారద గతేడాది సెప్టెంబరు 20న ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుంది. ఆమె మానసిక స్థితి సరిగా లేక ఈ దారుణానికి పాల్పడిందని నాడు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Advertisement

భార్య మరణంతో ఒంటరి జీవితం భరించలేక మే 15న పెళ్లి రోజు కాగా.. ముందురోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేటలోని అత్తవారింటి ముందు తన భార్య ఉరేసుకున్న చెట్టు కిందనే పురుగు మందు తాగి పడిపోయి మృతి చెందాడు.

శ్యాంసుందర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కొడుకు మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. కొడుకు అంత్యక్రియల అనంతరం గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. వరుస మరణాలతో ఇరు కుటుంబాలతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×