E-Paper
Advertisement

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు..  ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు
Advertisement

Falaknuma train: ఫలక్‌నుమా ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో ట్రైన్ ఆపేశారు. ఆ తర్వాత పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ విషయం తెలియగానే జీఆర్పీఎఫ్ పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.

హైరా నుంచి సికింద్రాబాద్ వస్తోంది ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్. ఆ ట్రైన్‌‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే అలర్టయిన రైల్వే పోలీసులు రైలుని ఘట్ కేసర్ వద్ద ఆపేశారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. జీఆర్పీఎఫ్, ఘట్‌కేసర్ పోలీసులు స్టేషన్‌లో రైలుని ఆపి సోదాలు చేపట్టారు.

Advertisement

స్టేషన్‌లోకి ఎవరినీ రాకుండా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత సికింద్రాబాద్ పంపించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఘట్‌కేసర్‌‌‌కు రైలు చేరుకుంది. తనిఖీలు తర్వాత ఉగ్రవాదులు ఉన్నారా? లేదా అనేదానిపై క్లారిటీ రానుంది.

ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సి వుంది. తనిఖీల తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఘట్‌కేసర్ స్టేషన్‌లో ఎక్కువగా ప్లాట్‌ఫామ్స్ ఉండడంతో ఓ ట్రాక్‌లోకి ఈ రైలుని తీసుకుని సోదాలు చేస్తున్నారు. అదే రూట్లో వెళ్లే రైళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు.

Advertisement

ALSO READ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు

ఈ విషయంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేశారు.  నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అణువణువుగా ప్రయాణికులను ప్రశ్నించి, టికెట్లు పరిశీలిస్తున్నారు. ఘట్ కేసర్ నుంచి సికింద్రాబాద్‌కు ఆ రైలు రావటానికి ఇంకా సమయం పట్టే అవకాశముందని అంటున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×