E-Paper
Advertisement

Warangal: ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో తన్నుకున్న బీఆర్ఎస్ VS కాంగ్రెస్ కార్యకర్తలు

Warangal: ఎన్నికల ఎఫెక్ట్.. వరంగల్‌లో తన్నుకున్న బీఆర్ఎస్ VS కాంగ్రెస్ కార్యకర్తలు
Advertisement

Warangal: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాయి. నిత్యం కలిసిమెలిసి ఉండే ప్రజలు పార్టీల పరంగా విడిపోయి తన్నుకునే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో మూడో విడత పోలింగ్‌కు ముందు ఇదే తరహా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలం, చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య అర్ధరాత్రి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రెండు ప్రధాన పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకోవడంతో తండాలో ఉద్రిక్తత పెరిగింది.

అర్ధరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
ఈ తండాలో రేపు (మంగళవారం) మూడో విడత పంచాయతీ పోలింగ్ జరగనుండగా, అభ్యర్థులు, పార్టీ మద్దతుదారులు విజయం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో, రెండు వర్గాల కార్యకర్తలు ఎన్నికల వ్యూహాలపై చర్చించుకుంటున్న సందర్భంలో మాటామాటా పెరిగింది. చిన్నగా మొదలైన ఈ వాగ్వాదం క్షణాల్లోనే పెద్ద గొడవగా మారి పరస్పర దాడులకు దారితీసింది. ఇరు వర్గాలు విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి.

Advertisement

మాటామాటా పెరిగి పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు
ఈ పరస్పర దాడిలో ఇద్దరు బీఆర్‌ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థులు తమ విజయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారనడానికి ఈ ఘటన ఉదాహరణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే ఈ తరహా హింస, గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోంది. ఈ ఘర్షణతో చెరువుకొమ్ము తండాలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

Also Read: ఇదేం చలి రా బాబు.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న జనాలు

Advertisement

గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు
అయితే ఈ ఘర్షణ గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్తతలను నియంత్రించేందుకు తండాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. గొడవకు కారణమైన ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రధానంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, దాడికి పాల్పడటం వంటి అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×