E-Paper
Advertisement

Sahiti Infra Case: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ దూకుడు.. ఉక్కిరిబిక్కిరవుతున్న లక్ష్మినారాయణ

Sahiti Infra Case: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ దూకుడు.. ఉక్కిరిబిక్కిరవుతున్న లక్ష్మినారాయణ
Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ విచారణ మొదలైంది. ఐదు రోజులపాటు లక్ష్మి నారాయణను ఈడీ ప్రశ్నించనుంది. సోమవారం మొదటిరోజు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. సాహితీ ఇన్‌ఫ్రా పేరు మీద వేల మంది దగ్గరి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు లక్ష్మినారాయణ. చాలా డబ్బును సొంతానికి వాడేసుకున్నాడు. చెప్పిన టైమ్‌కు కస్టమర్లకు ఇళ్లు అందించలేదు. దీంతో వారంతా సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. అధికారులతో కుమ్మక్కై, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఈడీ ఎంట్రీతో కేసు కీలక మలుపు తిరిగింది.

ఈడీ ఎంట్రీ

Advertisement

రూ. వేల కోట్ల స్కామ్ కావడంతో తర్వాత ఈడీ ఎంటర్ అయింది. కేసు నమోదు చేసి పీఎంఎల్ఏ యాక్ట్ కింద సెప్టెంబర్ 29న లక్ష్మినారాయణను అరెస్ట్ చేసింది. అతడ్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర వుందన్న దానిపై ఐదు రోజులపాటు లక్ష్మినారాయణను ప్రశ్నిస్తోంది. ప్రీ లాంచ్ ఆఫర్లతో దాదాపు 1600 మంది కస్టమర్ల నుంచి 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు విచారణ అధికారులు.

Also Read: పక్కా వ్యూహంతోనే లోకల్ ఫైట్ బరిలోకి: మహేష్ కుమార్ గౌడ్

Advertisement

స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనాలు

కస్టమర్ల నుంచి తీసుకున్న సొమ్మును లక్ష్మినారాయణ ఏం చేశాడా అని ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే పలు సంచలన కథనాలు ఇచ్చింది. సాహితీ ఇన్‌ఫ్రా, లక్ష్మినారాయణ లావాదేవీల వివరాలను, ఇష్టారాజ్యంగా జరిగిన క్యాష్ పంపకాలను జనం ముందు ఉంచింది. ఇదే క్రమంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో సాహితీతో లింక్స్ ఉన్నవారిలో భయం మొదలైంది. అయితే, అధికారులు అంతవరకు వెళ్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. విచారణలో మాత్రం అన్ని విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×