E-Paper
Advertisement

ED Raids: రియల్‌ ఎస్టేట్‌ పేరుతో.. రూ.60 కోట్ల దోపిడీ

ED Raids: రియల్‌ ఎస్టేట్‌ పేరుతో.. రూ.60 కోట్ల దోపిడీ
Advertisement

ED Raids: హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పేరుతో.. జరుగుతున్న భారీ మోసాలపై ఈడీ ఫోకస్ చేసింది. ఇటీవల ప్రీలాంచ్ ఆఫర్, ఫ్యూచర్ డెలివరీ ప్రాజెక్ట్స్ అనే పేర్లతో వేలాది కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు అధికారుల రాడార్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా జయత్రి ఇన్ఫ్రా అనే కంపెనీపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జయత్రి ఇన్ఫ్రా పేరుతో పనిచేస్తున్న సంస్థ.. భారీ మోసాలకు పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణలో ఈ సంస్థ ముందుగా నిర్మాణం ప్రారంభించకుండానే ఫ్రీలాంచ్ అంటూ భారీ డిస్కౌంట్లు చూపుతూ సుమారు 60 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బయటపడింది.

Advertisement

ఈ సంస్థ గడువు తేదీ లోపు ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో.. కొనుగోలుదారులు మోసపోయామని పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ కేసులు నమోదు కావడంతో ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) పరిధిలో ECR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

జయత్రి ఎండి శ్రీనివాస్ ఇళ్లు, జనప్రియ, రాజా డేవలపర్స్,గాయత్రి హోమ్స్, శివ సాయి పేరుతో షెల్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించారు. జయత్రి ప్రాజెక్ట్ భూముల డాకుమెంట్స్, ఫ్రీ లాంచ్ పంప్లేట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

ఇవి పరిశీలించిన తర్వాత, బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో చాలావాటిని అధికారిక నిర్మాణ పనులకు వినియోగించకుండా షెల్ కంపెనీల్లోకి మళ్లించారని ఈడీ గుర్తించింది. దీనితో మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసును మరింత విస్తరించి దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఈడీ సోదాలు జరుగుతున్ననేపథ్యంలో జయత్రి ఇన్ఫ్రా ఎండి శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. అతని మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉండటం, ఇంటి వద్ద లేనివిషయం గుర్తించిన అధికారులు ఆయన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు.

Also Read: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 26న ఈ ఏరియాల్లో నీటి సరఫరా బంద్

హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో ఫ్రీలాంచ్ ఆఫర్ పేరుతో మోసాలు పెరగడంతో.. ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఈడీ దృష్టిలోకి వచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×