// // Fertility Centre Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్..! -->
E-Paper
Advertisement

Fertility Centre Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్.. 50కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్..!

Fertility Centre Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్.. 50కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్..!
Advertisement

Fertility Centre Scam: స్వేచ్ఛ బ్యూరో: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ అధికారులు కొరడా ఝళిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్​ నమ్రతకు చెందిన 29.76కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్​ చేశారు. బహిరంగ మార్కెట్​ లో వీటి విలువ 50కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డాక్టర్ నమ్రత గోపాలపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్​ ను నడిపించిన విషయం తెలిసిందే.

మీ కల నెరవేరుస్తానని..

సంతానం లేని భార్యాభర్తలకు సంతాన భాగ్యం కల్పిస్తానని విస్తృతస్థాయిలో ఆమె ప్రచారం చేయటంతో పదుల సంఖ్యలో జనం ఆమె వద్దకు వచ్చారు. ఇలా వచ్చిన వారిని విశాఖపట్టణంలోని మరో బ్రాంచ్​ కు పంపించి అక్కడ వైద్య పరీక్షలు జరిపిస్తూ వచ్చిన డాక్టర్​ నమ్రత సరోగసి ద్వారా మీ కల నెరవేరుస్తానని నమ్మించింది. ఈ క్రమంలో లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే, సరోగసి ద్వారా కాకుండా ఇతరులకు పుట్టిన శిశువులను డబ్బు ఇచ్చి కొని సంతానం కోసం తన వద్దకు వస్తున్న వారికి మీకే పుట్టారని చెప్పి అప్పగించింది. అయితే, ఢిల్లీకి చెందిన ఓ దంపతులు అనుమానంతో తమకు ఇచ్చిన బిడ్డకు డీఎన్​ఏ పరీక్షలు జరిపించగా డాక్టర్​ నమ్రత సాగిస్తున్న అక్రమాలు బయట పడ్డాయి. భార్యాభర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు విచారణ జరిపారు. దీంట్లో తన అక్రమాలను కొనసాగించటానికి డాక్టర్ నమ్రత ఏజెంట్లు, సబ్ ఏజెంట్లతో ఓ పెద్ద నెట్ వర్క్ నడిపినట్టుగా వెల్లడైంది.

Advertisement

Also Read: Hyderabad Murder: వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తి దారుణ హత్య..!

29.76 కోట్ల రూపాయల..

డాక్టర్​ లైసెన్స్ సస్పెండ్​ అయినా ఆ విషయాన్ని దాచి పెట్టి 2014 నుంచి డాక్టర్ నమ్రత సరోగసి పేర చైల్డ్​ ట్రాఫికింగ్ కు పాల్పడుతూ వచ్చినట్టుగా నిర్దారణ అయ్యింది. ఈ క్రమంలో గోపాలపురం పోలీసులు డాక్టర్​ నమ్రతతోపాటు అడ్వకేట్​ గా పని చేస్తున్న ఆమె కుమారుడు, మరికొందరు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగినట్టుగా తెలియటంతో ఈడీ అధికారులు కూడా కేసులు నమోదు చేశారు. ఇటీవల కోర్టు అనుమతితో డాక్టర్ నమ్రతను మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. ఈ క్రమంలో డాక్టర్​ నమ్రత, ఆమె కుమారుల పేరన యాభైకి పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 29.76 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను మంగళవారం అటాచ్​ చేశారు. నిజానికి ప్రైవేట్ మార్కెట్ లో వీటి విలువ 5‌‌0 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: Jupally Krishna Rao: ఆదాయ మార్గాల కోసం ప్రణాళికలు రూపొందించండి: మంత్రి జూపల్లి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×