E-Paper
Advertisement

Telangana Voters List: తెలంగాణపై ఈసీ ఫోకస్.. మొదలవనున్న ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ.. వెబ్ సైట్‌లో తప్పుల తడక!

Telangana Voters List: తెలంగాణపై ఈసీ ఫోకస్.. మొదలవనున్న ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ.. వెబ్ సైట్‌లో తప్పుల తడక!
Advertisement

Telangana Voters List: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో త్వరలో అత్యంత కీలకమైన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో దొర్లిన భారీ తప్పిదాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ (SIR) డేటాను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే, ఇందులో తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపానికి, జిల్లాలకు ఏమాత్రం సంబంధం లేని, అసలు ఉనికిలోనే లేని ప్రాంతాల పేర్లను ఈసీఐ జాబితాలో చేర్చడం గమనార్హం. ఇలా లేని ప్రాంతాల పేర్లు అధికారిక వెబ్‌సైట్‌లో దర్శనమివ్వడంతో అధికారుల పనితీరుపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి అవగాహన లేకుండానే ఢిల్లీ స్థాయిలోనే డేటాను రూపొందించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీహార్‌లో ఇప్పటికే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని గుర్తుచేశారు. బీహార్ విధానాన్ని ఒక ప్రామాణికంగా (Benchmark) తీసుకుని, తెలంగాణలో కూడా దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. మూడో విడతలో భాగంగా తెలంగాణలో ఈ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను చేపట్టనున్నారు.

మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్డీయేతర పక్షాలు (Non-NDA Parties) అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని మండిపడుతున్నాయి. ఇప్పటికే కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, కొత్త పేర్ల చేర్పుల్లో కేంద్రం పెత్తనం చెలాయిస్తోందన్నది ఆయా పార్టీల ప్రధాన ఆరోపణ.

Advertisement

ప్రస్తుతం రెండవ విడతలో భాగంగా మరో 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో తెలంగాణలో ఇది ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పటికే వెబ్‌సైట్ తప్పులతో మొదలైన రచ్చ, రానున్న రోజుల్లో రాజకీయంగా మరెంత వేడిని రాజేస్తుందో వేచి చూడాలి.

Read Also: శత్రువుతో చేతులు కలిపిన ఝాన్సీ రెడ్డి? ఎర్రబెల్లితో ‘చీకటి ఒప్పందం’ బట్టబయలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×