E-Paper
Advertisement

MP Eatala Rajender: సంక్షేమ పథకాలు ఎక్కువిస్తున్నారంటే బలహీనతే: ఎంపీ ఈటల రాజేందర్

MP Eatala Rajender: సంక్షేమ పథకాలు ఎక్కువిస్తున్నారంటే బలహీనతే: ఎంపీ ఈటల రాజేందర్
Advertisement

MP Eatala Rajender: స్వేచ్ఛ బ్యూరో: సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రభుత్వం అందిస్తుంది అంటే అది బలహీనతగానే భావించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పాన్ ఐఐటీ అల్యూమినీ ఇండియా సమావేశానికి ముఖ్య అతిథిగా ఈటల హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలు వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని సూచించారు. ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి రాకూడదన్నారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో మేధావులు వలసపోవడం ఆగిందని, రీసెర్చ్, స్టార్ట్ అప్ లకు నిధులు పెరిగాయన్నారు. ఎలక్షన్ కోసం, రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం పాలసీలు తీసుకురావాలని సూచించారు.

ప్రపంచ మేధా సంపత్తి..

టెక్నాలజీని ప్రజల సంక్షేమం కోసం మాత్రమే వాడినప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని వివరించారు. టెక్నాలజీ, జీనోమ్, సైన్స్ మీద రీసెర్చ్ లేకుండా.. వీటిపై ఇన్వెస్ట్ మెంట్ లేకుండా ముందుకు పోలేమని మోడీ గుర్తించి, ఆ దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు ఐఐటీల్లో చదువుకుని బయటికి పోతున్నప్పుడు బాధ అనిపించేదని ఈటల చెప్పుకొచ్చారు. ప్రపంచ మేధా సంపత్తి అమెరికాలో జమవ్వడంతో ఆదేశం ఏ స్థాయికి ఎదిగిందో చూస్తున్నామని, ట్రంప్ లాంటి వారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారని, మరి మనం ఎందుకు ఎదగలేమని ప్రశ్నించారు. అమెరికా, రష్యా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అయితే, బ్రిటన్, యూరప్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ గా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా థర్డ్ వరల్డ్ కంట్రీస్ గా పిలవబడుతున్నాయని, ఇంత మేధాసంపత్తి కలిగిన భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండే పరిస్థితి బాధాకరమన్నారు.

Advertisement

Also Read: Social drama OTT: పెళ్లయినా పనికిరాని మొగుడు.. అత్తకు దగ్గరగా… ఇది మామూలు కథ కాదు

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

2014 వరకు 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కానీ ఇంకా సమగ్రమైన అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన దేశమైనా ఎక్కడో అంతరాలు పెరిగిపోతున్నాయని ఈటల తెలిపారు. 80 కోట్ల మందికి ఇంకా బియ్యం ఇస్తున్నామంటేనే ఆలోచన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అల్యూమినీ అధ్యక్షుడు ప్రభాత కుమార్, సెక్రటరీ అశోక్, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, సుధాకర్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Also Read: Actor Sivaji : మరో వివాదంలో నటుడు శివాజీ.. మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×