E-Paper
Advertisement

కారు, బైక్ కాదు.. ఏకంగా బస్సునే దొంగిలించాడు! చివరికి ఎలా దొరికాడంటే..?

కారు, బైక్ కాదు.. ఏకంగా బస్సునే దొంగిలించాడు! చివరికి ఎలా దొరికాడంటే..?
Advertisement

RTC Bus: మద్యం మత్తులో మనుషులు ఎన్నో విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. మామూలుగా మద్యం మత్తులో బైకో, కారో దొంగిలించడం చూసుంటాం.. కానీ ఒక వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే లేపేశాడు. తాగాడనే స్పృహ కూడా లేకుండా దాన్ని రోడ్డెక్కించి, కిలోమీటర్ల మేర నడిపి, చివరికి టోల్‌గేట్ దగ్గర అడ్డంగా బుక్కైపోయాడు. జనగామ జిల్లాలో జరిగిన ఈ వింత చోరీ అధికారుల సైతం షాక్‌కి గురి చేసింది.

బస్టాండ్‌లో బస్సు మాయం!

Advertisement

జనగామ డిపోకు చెందిన ఒక అద్దె బస్సు (హైర్ బస్సు) సర్వీస్ ముగించుకుని రాత్రి సమయంలో జనగామ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉంది. అదే సమయంలో పాలకుర్తి మండలానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి పూర్తి మద్యం మత్తులో అక్కడికి వచ్చాడు. బస్టాండ్‌లో ఖాళీగా ఉన్న ఆ బస్సును చూసి, ఎలాగైనా దాన్ని నడపాలనే పిచ్చి ఆలోచన వచ్చిందేమో.. డ్రైవర్, కండక్టర్ అక్కడ లేకపోవడాన్ని గమనించి.. సీట్లోకి ఎక్కి కూర్చున్నాడు. మత్తులో ఉన్నప్పటికీ ఎలాగోలా బస్సును స్టార్ట్ చేసి, బస్టాండ్ నుంచి రోడ్డుపైకి తెచ్చాడు.

21 కిలోమీటర్ల హైస్పీడ్ రైడ్

Advertisement

బస్సు చేతికి దొరకడమే ఆలస్యం.. వెంకన్న సూర్యాపేట హైవే వైపు బండిని పోనిచ్చాడు. రాత్రి వేళ, పైగా ఫుల్లుగా తాగి ఉండటంతో బస్సును ఇష్టమొచ్చినట్టు వేగంగా నడిపాడు. అలా దాదాపు 21 కిలోమీటర్ల మేర రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బస్సును ముందుకు తీసుకెళ్లాడు. బస్సు మాయమైన విషయం గమనించిన ఆర్టీసీ సిబ్బంది అప్పటికే పోలీసులకు సమాచారం అందించారు.

టోల్‌గేట్ వద్ద క్లైమాక్స్

ఈ ప్రమాదకరమైన ప్రయాణానికి సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద బ్రేక్ పడింది. టోల్ ప్లాజా వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న వెంకన్నకు బస్సుపై నియంత్రణ తప్పింది. బస్సు వేగంగా వెళ్లి టోల్‌గేట్ వద్ద ఉన్న సిమెంట్ దిమ్మెను (డివైడర్) బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని అక్కడికక్కడే ఆగిపోయింది. లక్కీగా ఈ ప్రమాదంలో టోల్ సిబ్బందికి గానీ, నిందితుడికి గానీ ఎలాంటి పెద్ద గాయాలు కాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. మత్తు దిగాక తానేం చేశాడో తెలిసి సదరు కిలాడీ దొంగ లబోదిబోమంటున్నాడు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×