E-Paper
Advertisement

President Droupadi Murmu: హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

President Droupadi Murmu: హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
Advertisement

President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి వస్తున్న సందర్భంగా ముందుగానే.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి సీతక్క పలువురు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రాగానే.. గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి పుష్పగుచ్చాన్ని అందించి, పలువురు అధికారులు కూడా స్వాగతం పలికారు.

Advertisement

అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి కాన్వాయ్ బయలుదేరి వెళ్ళింది. రాష్ట్రపతి కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో, పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు. రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన సాగుతున్న సందర్భంగా, హైదరాబాద్ పోలీసులు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read: Cm Revanth Reddy On Musi: హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి.. శాపం కావ‌ద్దు.. సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్

Advertisement

శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సందర్భంగా పోలీసులు హైదరాబాద్ లో భారీ బందోబస్తు చేపట్టారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×