E-Paper
Advertisement

Krishna health Condition: కృష్ణ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు: వైద్యులు

Krishna health Condition: కృష్ణ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు: వైద్యులు
Advertisement

Krishna health Condition: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ గురునాథ్ రెడ్డి వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడేం ఏం మాట్లాడలేమని మరోసారి స్పష్టం చేశారు. కృష్ణకు వెంటిలేటర్‌పైనే వైద్యం కొనసాగుతోందని వివరించారు. కిడ్నీ, లంగ్స్‌, బ్రెయిన్‌ బాగా ఎఫెక్ట్‌ అయినట్లు డాక్టర్ గురునాథ్ రెడ్డి వెల్లడించారు. అ‍న్ని విభాగాలకు చెందిన 8 మంది వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందన్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు కృష్ణ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు.

కృష్ణకు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్‌ చాలా వరకు ఎఫెక్ట్‌ అయినట్లు వెల్లడించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో అంతర్జాతీయస్థాయి వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్లినా ఇంతకు మించి ఎలాంటి వైద్యం చేయరని స్పష్టం చేశారు. కృష్ణ ఈ ఆస్పత్రిలోనే చాలా ఏళ్లుగా చికిత్స తీసుకుంటున్నారని గురునాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వెల్లడించారు. కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కు గురికావడంతో ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×