E-Paper
Advertisement

కేంద్రమంత్రి గడ్కరీతో డీకే అరుణ భేటీ.. అభివృద్దికి భారీ స్కెచ్!

కేంద్రమంత్రి గడ్కరీతో డీకే అరుణ భేటీ.. అభివృద్దికి భారీ స్కెచ్!
Advertisement

DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల కేంద్రంగా రెండు ప్రధాన జాతీయ రహదారులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరిని కలిసి ఎంపీ డీకే అరుణ విన్నవించారు. గద్వాల కేంద్రంగా రెండు ప్రధాన జాతీయ రహదారులను ఏర్పాటు చేయడం ద్వారా పరువు రాష్ట్రాలకు రవాణా సౌలభ్యం పెరుగుతుందని ఆమె కేంద్ర మంత్రికి విన్నవించారు.

జాతీయ రహదారుల మంజూరు

ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన డీకే అరుణ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంత అభివృద్ధికి కీలకమైన రెండు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల మంజూరు చేయాలని కోరారు. ఎర్రవల్లి – గద్వాల్ – రాయచూర్ రహదారి (67 కి.మీ) కొత్తకోట – గద్వాల్ – మంత్రాలయం రహదారి (90 కి.మీ) రహదారుల ప్రాధాన్యతను వివరించారు. ఈ రోడ్లు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతాయన్నారు. నూతన రహదారులను నెలకొల్పడం ద్వారా పర్యాటకం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయన్నారు.

Advertisement

Also Read: నన్ను ఉరితీయండి కానీ.. సీఎంకు పాడి కౌశిక్ రెడ్డి భావోద్వేగ సవాల్!

గత15 ఏళ్లుగా..

తెలంగాణలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న, జాతీయ రహదారి సమీపంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంతో పాటు మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలకు భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. గత15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మద్దతు తెలిపారన్నారు. ఇరిగేషన్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతలో ఈ రెండు గ్రీన్ ఫీల్డ్ రహదారులు ఎంతో అవసరమని డికె అరుణ కేంద్ర మంత్రికి తెలియజేస్తూ.. వెంటనే వాటిని పరిశీలించి మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు.

Advertisement

Also Read: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎట్టకేలకు తెరుచుకున్న చలివేంద్రం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×