E-Paper
Advertisement

రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన కామెంట్స్.. ‘గాలి మోటార్’ అస్త్రంతో స్ట్రాంగ్ కౌంటర్!

రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన కామెంట్స్.. ‘గాలి మోటార్’ అస్త్రంతో స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ.. గాలి మాటలు చెబుతున్నారని పాలమూరు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిపై అవగాహన, చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదని విమర్శించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కేసీఆర్ పదేళ్లలో కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పి చేయలేదని, కాంగ్రెస్ రెండున్నరేండ్లలో కూడా ఏమీ చేయలేదని, నిధులు ఇచ్చిందీ లేదని ఫైరయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి సొమ్ము నుంచి ఇవ్వడం లేదని, ప్రజల సొమ్ముతో ఇస్తున్నారని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని ధ్వజమెత్తారు.

Advertisement

తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్దులై పని చేయాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు చేసే ప్రతి పోరాటంలో తాము భాగస్వామ్యులు అవుతామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Also Read: నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ మైండ్ బ్లోయింగ్ సవాల్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×