E-Paper
Advertisement

DK Aruna: పాలమూరు నీళ్లపై రాజకీయం.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

DK Aruna: పాలమూరు నీళ్లపై రాజకీయం.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు
Advertisement

DK Aruna: పాలమూరు జిల్లాను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ.. ప్రజల జీవితాలతో ఆడలాడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరికి పాలమూరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు.

ఒకరిపై ఒకరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారే. పాలమూరుకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన వారికి లేదు అని ఆమె స్పష్టంగా వ్యాఖ్యానించారు.

Advertisement

జూరాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకురావాలని మొదట రూపొందించిన డీపీఆర్ ప్రకారమే ముందుకు వెళ్లాలని.. తాను అనేకసార్లు చెప్పానని డీకే అరుణ తెలిపారు. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు రైతుల తో ఆట ఆడుతున్నారు. మాయ మాటలతో, మోసం చేసి.. మరో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. తప్పులను వాళ్ళ పై నెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ నాటకం ఆడుతోందని మండిపడ్డారు. ఇద్దరు ఆడుతున్న నాటకం లో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

పాలమూరు ప్రజలను పదేళ్ల పాటు కేసీఆర్ మోసం చేశారని, అయినప్పటికీ ప్రజలు ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని డీకే అరుణ గుర్తు చేశారు.

Advertisement

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డీపీఆర్‌ను టేకప్ చేయాలని, లేదంటే ఇంతకు ముందు రూపొందించిన ప్రాజెక్ట్‌ను కల్వకుర్తిలో కలిపేయాలని సూచించారు. లేదా నాగర్‌కర్నూల్, నల్గొండ అని పేరు పెట్టండి. కానీ అందులో పాలమూరు, రంగారెడ్డి అనే పేర్లు ఉండవు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పాలమూరు ప్రాంత ఎమ్మెల్యేలపై కూడా డీకే అరుణ విమర్శలు చేశారు. డిండి కి నీళ్లు తీసుకెళ్తుంటే పాలమూరు ఎమ్మెల్యేలు ఎందుకు నోర్లకు ప్లాస్టర్ వేసుకున్నారు? నోర్లు మూసుకుని చోద్యం చూస్తున్నారు అంటూ ఆమె ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎందుకు సమీక్షలు పెట్టడం లేదని కూడా ఆమె నిలదీశారు.

పాలమూరు ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు నోర్లకు ప్లాస్టర్ వేసుకున్నారు.. డిండి కి నీళ్ళు తీసుకువెళ్తుంటే నోర్లు మూసుకొని,చోద్యం చూస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ఎందుకు రివ్యూలు పెట్టడం లేదు. నన్ను పిలవకపోయినా ఒకసారి వెళ్ళడం జరిగింది.

తనను రివ్యూలకు ఆహ్వానించడం లేదని, అయినప్పటికీ ఒకసారి తానే వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నానని డీకే అరుణ తెలిపారు. “నన్ను పిలవకపోయినా వెళ్లాను. కలసి నిర్ణయం తీసుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు.

Also Read: జనవరి 4న గచ్చిబౌలిలో ఎగ్జామ్‌థాన్‌ రన్.. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్ మనీ

వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన ఇరిజేషన్ నిపుణులు,అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ పెట్టాలని, వచ్చే మూడేళ్లలో అయిన పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసే చొరవ సీఎం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×