E-Paper
Advertisement

Diwali Rituals: బాబోయ్.. స్మశానంలో దీపావళి వేడుకలు.. ఎక్కడో తెలుసా?

Diwali Rituals: బాబోయ్.. స్మశానంలో దీపావళి వేడుకలు.. ఎక్కడో తెలుసా?
Advertisement

Diwali Rituals: సాధారణంగా దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్ళను పూజిస్తారు. ఇంటి వద్ద కేదారీశ్వర నోములు నోముకుంటారు. కాని కొన్ని సామాజికవర్గాల కుటుంబాలు మాత్రం.. తమ పెద్దల సమాధుల వద్ద పూజలు నిర్వహించి.. చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. దీపావళి పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే.. వీళ్లు మాత్రం స్మశాన వాటికలకి  వచ్చి సమాధుల ముందు దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కోనసాగిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోనే ఓ సామాజిక వర్గం.

స్మశానంలోకి అడుగు పెట్టాలంటే  చాల మంది భయపడుతూ ఉంటారు. కానీ కరీంనగర్ లో ఆరు దశబ్దాలకు పైగా స్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కోనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటు.. తమ కుటుంబీకులను ఖననం చేసిన శ్మశాన వాటికలో.. సమాధుల వద్ద దీపాలు వెలిగించి  వేడుక చేసుకుంటారు. వినడానికి కోంత వింతగా అనిపించిన చాల కుటుంబాలు ఈ తంతును ఆచరిస్తున్నాయి.

Advertisement

కరీంనగర్ లోని కార్ఖన గడ్డలో ఉన్న హిందు స్మశాన వాటికలో.. ప్రతి యేటా దళిత కుటుంబాలు స్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటారు.  పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటిక వద్ద అంత శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి అక్కడ అంత శుభ్రం చేసిన తరువాత.. పూలతో సమాధులను అలంకరిస్తారు. దీపావళి నాటికి సమాధులను ముస్తాబు చేసి.. పండగ రోజును సాయంత్రం కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు చేరుకుని అక్కడే గడుపుతారు.

సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే.. తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని స్థానికులు చెప్తుంటారు. అందుకోసమే చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరూ తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు కూడా వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెడతారు. పితృ దేవతలకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం  వారిని స్మరించుకుంటూ వారి సమాధుల వద్ద ఆయా కుటుంబీకులు పూజలు చేస్తారు. ఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు.

Advertisement

ఉపాధి కోసం వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన వారంతా.. దీపావళి పండగకు మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ కు చేరుకుని, తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద పండుగ జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని పిల్ల పాపలతో సాయంత్రం ఆరుగంటలకు సమాధుల వద్దకు వచ్చి.. అక్కడే రెండు గంటలు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వికులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు.

Also Read: వేములవాడలో ఫ్లెక్సీల గోల.. కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో

దీపావళి పండుగ రోజున చనిపోయిన వారి సమాధుల వద్దనే.. ఇంటిల్లి పాది దీపావళి వేడుకలు చేసుకుంటారు.  అక్కడే పిల్ల పాపలతో టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా జరుపుకోవడం కరీంనగర్‌లోని కొంత మందికి సంప్రదాయంగా వస్తుంది. ఏది ఏమైనా గాని దీపావళి పండుగ రోజున తమని కానీ పెంచి ఇంతవారిని చేసిన.. తమ కుటుంభ సభ్యుల మధ్య దీపావళి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఇదే తమకి నిజమైన దీపావళి పండుగ అని అంటున్నారు ఆ ఊరి ప్రజలు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×