E-Paper
Advertisement

Kancharla Bhupal Reddy : నల్గొండ బీఆర్ఎస్ లో ముసలం.. అధిష్టానానికి కొత్త తలనొప్పి

Kancharla Bhupal Reddy : నల్గొండ బీఆర్ఎస్ లో ముసలం.. అధిష్టానానికి కొత్త తలనొప్పి
Advertisement

Kancharla Bhupal Reddy : నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ముసలం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం నచ్చని అసమ్మతి నేతల రాగం కంటిన్యూ అవుతోంది. అభ్యర్థిని మార్చకపోతే ఎమ్మెల్యేను ఓడించి తీరుతామంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ.. తమ గళాన్ని వినిపిస్తుండటంతో ఈ ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి ఓటమి తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.

త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్‌ అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి సమరశంఖాన్ని పూరించారు. అయితే.. నల్గొండ జిల్లాలో మళ్లీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి టికెట్ కన్‌ఫర్మ్‌ చేయడం అక్కడి కొందరు నేతలకు నచ్చలేదు. దీంతో పిల్లి రామరాజుయాదవ్‌, చాడ కిషన్‌రెడ్డిలు సహా పలువురు ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మంత్రి కేటీఆర్‌ టూర్‌కు దూరంగా ఉన్నారు. ఇక మరోపక్క ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి తమ అసమస్మతి గళాన్ని వినిపిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే.. నల్గొండ కౌన్సిలర్‌, మాజీ బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న రామరాజుయాదవ్‌ బరిలో నిలిచేది తానేనంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ.. తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తుండటంతో ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×