E-Paper
Advertisement

MP Arvind: కవిత పై ఎంపీ అరవింద్ సెటైర్లు.. కవిత లోపలున్నా బయటున్నా ఒరిగేదేం లేదంటూ..?

MP Arvind: కవిత పై ఎంపీ అరవింద్ సెటైర్లు.. కవిత లోపలున్నా బయటున్నా ఒరిగేదేం లేదంటూ..?
Advertisement

MP Arvind: కల్వకుంట్ల కవిత బయట ఉన్నా, లోపల ఉన్నా ఆమె వల్ల తెలంగాణ రాజకీయాలకు ఒరిగేదేమీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవాచేశారు. నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ కేసుపై సీబీఐ హయ్యర్ కోర్టు కు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. తప్పు చేయకపోతే కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తమకు కవిత పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదని, తమకు రేవంత్ రెడ్డిపై ఇంట్రెస్ట్ ఉందన్నారు.

కవిత ఇంగ్లిష్ చదువుకోలేదా?

రాష్ట్రాన్ని క్రిమినల్ నడుపుతున్నారని, తమ టార్గెట్ ఆ క్రిమినల్ పై ఉంటుందని చురకలంటించారు. కవిత ఏమైనా పదవిలో ఉందా? అసలు అమె ఎవరని అర్వింద్ ఎద్దేవాచేశారు. కవిత ఇంగ్లిష్ చదువుకోలేదా? అని చురకలంటించారు. బీజేపీ వేరు బీఆర్ఎస్ వేరనే విషయం తనకు తెలియదా? అని సెటైర్లువేశారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలతో దొరికిన రేవంత్ రెడ్డి బయట తిరుగుతున్నారని, ఆయన బ్యాగు మోయడం, కట్టలు తీసి పెట్టారని, ఎవిడెన్స్ తో సహా దొరికారన్నారు. ఆయనపై ఆధారాలున్నా బయట తిరుగుతున్నారని, అలాగే కవితకు క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఆధారాల్లేవని మాత్రమే కోర్ట్ తీర్పు ఇచ్చిందన్నారు. కవిత ముత్యంలా తిరిగిరావడానికి ఇప్పుడు కడిగారా అంటూ అర్వింద్ ఎద్దేవాచేశారు.

Advertisement

Also Read: Kavitha vs BRS: కడిగిన ముత్యమైన కవిత.. బీఆర్ఎస్‌కు బురద.. కారు పని ఖేల్ ఖతమేనా?

అక్బరుద్దీన్‌ను పహిల్వాన్..

రెండు నెలల్లో పార్టీ పెట్టబోతున్న కవితకు అర్వింద్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కోరుట్లలో రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని అర్వింద్ ధీమా వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఆ సీటు మిస్ అయ్యామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు ఈ చేరికలు మొదటి స్టెప్ అని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిస్పరేట్ గా ఉన్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అవతల పార్టీ వారిని ఫ్లోర్ నాకిస్తాడని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని విమర్శించారు. అక్బరుద్దీన్ ను పహిల్వాన్ నెత్తిపై పొడిచినట్టు ఉన్నాడని, అందుకే ఆయన మైండ్ కూడా దొబ్బినట్టు ఉందని అర్వింద్ చురకలంటించారు.

Advertisement

Also Read: Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వద్దు.. వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తిచేయాలి: మంత్రి ఉత్తమ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×