E-Paper
Advertisement

ఉద్యోగం కోసం అమ్మవారికి బయోడేటా ఇచ్చిన యువకుడు.. అందులో ఏం రాశాడంటే?

ఉద్యోగం కోసం అమ్మవారికి బయోడేటా ఇచ్చిన యువకుడు.. అందులో ఏం రాశాడంటే?
Advertisement

Alampur Jogulamba: దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుళ్లను రక రకాలుగా మొక్కుకుంటారు భక్తులు. మా కోరిక తీర్చిస్తే మళ్లీ వస్తామని, లేకుంటే తలనీలాలు సమర్పిస్తామని చెబుతారు. కానీ మనసులోని ఎవరికీ చెప్పరు. అనుకున్న కోరిక తీర్చిస్తే.. అప్పుడు కుటుంబసభ్యులకు చెబుతారు. కానీ ఆ భక్తులు రూటే సెపరేటు. ఏకంగా అమ్మవారి హుండీలో ఓ భక్తుడు వినతిపత్రం దర్శనమిచ్చింది. అది చూసి ఆలయ పూజారి షాకయ్యారు. ఇంతకీ అందులో మేటరేంటి?

ఉద్యోగం కోసం అమ్మవారికి బయోడేటా-ఆలయాల హుండీల్లో కానుకలు, మొక్కుబడుల చీటీలు కనిపించడం మనం చూస్తూ ఉంటాము. అలంపూర్ జోగులాంబ అమ్మవారి హుండీలో ఓ భక్తుడి బయోడేటాతోపాటు హృదయాన్ని హత్తుకునే లేఖ అందులో కనిపించింది. అమ్మా జోగులాంబ.. అంటూ మొదలు పెట్టాడు. తాను పదో తరగతి మొదలు బీఈడీ వరకు చదివాను. ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నానని రాసుకొచ్చాడు. 80 శాతం పైగానే మార్కులు సాధించినట్లు ప్రస్తావించాడు.

Advertisement

జోగులాంబ హుండీలో వినతిపత్రం-ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నానని, కారణం ఏంటో గానీ ఉద్యోగం రావడం లేదని మనసులోని మాట అందులో పెట్టాడు. ఎన్నో పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేయాల్సిన ప్రయత్నాలు చేశానని, ఇక నీవు తాను దిక్కు అంటూ అమ్మవారికి మొర పెట్టుకున్నాడు. తన అర్హతకు తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అందులో వేడుకున్నాడు. అంతేకాదు దాంపత్య జీవితానికి సుఖశాంతులు కల్పించాలని మరో విజ్ఞప్తి కూడా చేశాడు.

ఆశ్చర్యపోయిన ఆలయ అధికారులు- హుండీ లెక్కింపులో లేఖను చూసి ఆశ్చర్యపోయిన ఆలయ అధికారులు. అమ్మవారిపై భక్తుడి విశ్వాసానికి నిదర్శనంగా చెబుతున్నారు. కేవలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులకే కాదు, చుట్టు పక్కలన జిల్లాల వాసులకు జోగులాంబ అమ్మవారికి విపరీతమైన నమ్మకం ఉంది. అమ్మవారికి తమ కష్టాలు చెప్పుకుంటే కచ్చితంగా తీరుతాయని అక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో సదరు భక్తుడు మాటలతో కాకుండా అమ్మవారికి లేఖ రూపంలో తెలిపాడని అంటున్నారు. ఇంతకీ ఆ భక్తుడు ఎవరు అనేది వెల్లడించలేదు ఆలయ అధికారులు.

Advertisement

ALSO READ: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణ అంతా భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఒకటే కుమ్ముడే

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×