E-Paper
Advertisement

Deputy Cm Tweet: హీరోకి థ్యాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం

Deputy Cm Tweet: హీరోకి థ్యాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం
Advertisement

Deputy CM Bhatti Vikramarka Thanks To Sai Dharam Tej In Twitter: ఈ మధ్యకాలంలో ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం కామన్ అయిపోయింది అందరికి.. ఎందుకంటే తమ ఫొటోలకు, వీడియోలకు లైక్స్, కామెంట్స్ వస్తాయని, మరికొందరు ట్రెండింగ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే అక్కడి వరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు అవే కొంపముంచుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల బారినపడి చాలామంది వారి భవిష్యత్‌ని నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు వారితో పాటుగా వారి పిల్లల భవిష్యత్‌ని నాశనం చేస్తున్నారు. తమ పిల్లల ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచమంతా క్రూరమైనదిగా, ప్రమాదకరంగా మారిపోయిందని తెలిపారు. అందుకే పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే ముందు తల్లిదండ్రులు కొంత వివేకంతో ఆలోచించాలని కోరాడు. సోషల్ మీడియాలో కొందరు మృగాలు ఉంటాయని, వారిని కట్టడి చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. వినోదం పేరిట పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని… ఇది భయంకరం, అసహ్యకరం కంటే కూడా ఎక్కువని సాయితేజ్ పేర్కొన్నారు. ఇప్పుడు పిల్లల భద్రత అత్యంత ముఖ్యమని, సోషల్ మీడియాలో ఇలాంటి వికృత ధోరణులను అరికట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఓ చిన్నారి బాలికకు సంబంధించిన వీడియోను కూడా సాయితేజ్ పంచుకున్నారు. ఆ వీడియోపై కొందరు వ్యక్తులు ఆన్ లైన్ లో చాటింగ్ చేసిన విధానాన్ని తేజ్ ప్రస్తావించారు. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.

Advertisement

Also Read: ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి ట్వీట్ వైరల్‌

ఎంతో కీలక సమస్యను ఎత్తిచూపినందుకు సాయితేజ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారుల భద్రత ఎప్పటికీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమేనని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో చిన్నారులపై వికృత ధోరణులు, వేధింపులను అరికట్టేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పిల్లలకు మరింత మెరుగైన ఆన్ లైన్ వాతావరణాన్ని అందించేందుకు మనం కలిసి పనిచేద్దామని భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ డిప్యూటీ సీఎం పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ గుడ్ మెసేజ్ ఇచ్చారండీ అంటూ డిప్యూటీ సీఎంని హీరోని కొనియాడుతున్నారు.

Advertisement

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×