E-Paper
Advertisement

Bhatti Vikramarka: పేదల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Bhatti Vikramarka: పేదల కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!
Advertisement

Bhatti Vikramarka:  ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుపేదల పక్షపాత ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైరా పట్టణం బస్టాండ్ కూడలి వద్ద దాదాపు నాలుగు దశాబ్దాలుగా రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న దాదాపు 100 కుటుంబాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. దుకాణాలను పునర్నిర్మాణం చేపిస్తామని నెపం పెట్టి గత బీఆర్ఎస్ సర్కార్ అన్ని షాపులను కూల్చేసి ఆయా కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసింది.

Also Read: Bhatti Vikramarka: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు!

8 కోట్ల రూపాయల మేర ఖర్చు

Advertisement

జీవనోపాధి కోల్పోయిన వారంతా ఏళ్ల తరబడి గత ప్రభుత్వం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. అయినా గత బీఆర్ఎస్ పాలకులు వారిపై ఏమాత్రం కనికరం చూపలేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం వైరా నుంచి మధిర వెళ్తున్న ఉపముఖ్యమంత్రి వాహనం వద్దకు వారంతా వచ్చి తమ ఆవేదనని బాధని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్న స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిరుపేదలకు జరిగిన అన్యాయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించి చెప్పారు. అంతేకాక ఇక్కడ నిరుపేదలకి దుకాణాలు కట్టించేందుకు సుమారు 8 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని ఉప ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివరించారు.

అనుమతులు మంజూరు చేస్తాం 

జీవనోపాధి కోల్పోయి నెట్టుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకుంటున్న వారిని చూసిన ఉపముఖ్యమంత్రి వీరందరికీ తప్పకుండా న్యాయం చేయాలని చెప్పారు. దుకాణాల నిర్మాణంకు సంబంధించి పూర్తి అంచనాలతో కూడిన నివేదికను పంపాలని అధికారులను అక్కడే ఆదేశించారు. అంచనాలకు సంబంధించిన నివేదికలు రాగానే అనుమతులు మంజూరు చేస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Hydra: హైడ్రా అదుర్స్ .. 1365 గ‌జాల ప్ర‌భుత్వ భూమి భూమిని కాపాడిన హైడ్రా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×