E-Paper
Advertisement

ఇష్టారీతిన డీమిలిటేషన్ చేస్తే.. ఊరుకునేదే లేదు.. కేంద్రానికి ఎంపీ చామల వార్నింగ్!

ఇష్టారీతిన డీమిలిటేషన్ చేస్తే..  ఊరుకునేదే లేదు.. కేంద్రానికి ఎంపీ చామల వార్నింగ్!
Advertisement

MP Chamala: డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ లపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రోరేటా ప్రకారం 50 శాతం, ఆర్ధిక వృద్ధి ఆధారంగా మరో 50 శాతం సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. అప్పుడే దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ చామల మండిపడ్డారు.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని చర్చ జరిగినప్పుడు మల్లిఖార్జున ఖర్గే ఇదే అభిప్రాయాన్ని చెప్పారని ఎంపీ చామల గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని మల్లిఖార్జున ఖర్గే కోరినట్లు పేర్కొన్నారు.

Advertisement

2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని ఎంపీ చామల అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుపై చర్చలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినప్పుడు 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం చెప్పిందని, 543 సీట్లకు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

Also Read: Vi Family Plan: వీఐ సర్‌ప్రైజింగ్ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు.. 3000 SMSలు, ఫ్రీ కాల్స్!

Advertisement

ప్రోరెటా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎంపీ చామల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని, పది రోజులు అగితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటీ? అంటూ ప్రశ్నించారు. డీ లిమిటేషన్ ను ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబోమని కేంద్రాన్ని భువనగిరి ఎంపీ హెచ్చరించారు.

Also Read: Amravati Case: అమరావతిలో 19 ఏళ్ల మృగం.. 180 మంది బాలికలను వేధించి.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×