E-Paper
Advertisement

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పు.. అన్న ఏమో అలా, నాన్నేమో ఇలా!

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పు.. అన్న ఏమో అలా, నాన్నేమో ఇలా!
Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కథ ముగిసింది. ఆ కేసులో నిజం లేదని, సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టిపారేస్తూ నిందితులుగా ఉన్న 20 మందిని నిర్దోశులుగా పేర్కొంటూ విడుదల చేసింది.దీంతో లిక్కర్ స్కామ్ కేసు ఉత్తదే అని తేలిపోయింది. సరైన ఆధారాలు లేని కారణంగా ఎలా అరెస్టులు చేస్తారని సీబీఐ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆధారాలు సేకరించకుండా విచారణ ముందుకు వెళ్లడం, శిక్షలు విధించడం సైతం సాధ్యం కాదని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా, ఇదే కేసులో 2023 ఎన్నికలకు ముందు అరెస్టు అయ్యి 166 రోజుల పాటు తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత నిర్దోషి అని మొత్తానికి కోర్టు తేల్చిచెప్పింది.

కేసీఆర్ మౌనం..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత నేరం చేయలేదని మొత్తం కోర్టు తేల్చినా.. మాజీ సీఎం కేసీఆర్ ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. సొంత కూతురు విషయంలో ఆయన స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనంతటికీ కవిత బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యవహరించిన తీరే కారణమా? అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయ్యి తిహార్ జైలులో ఉన్నప్పుడు ఆమెను బయటకు తీసుకురావడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హరీశ్ రావు చాలా కష్టపడ్డారు. నాడు కేసీఆర్ సీఎంగా ఉన్నా అంత త్వరగా బెయిల్ దొరకలేదు. దేశంలోనే టాప్ లాయర్లను సంప్రదించి కవిత కేసును వాదించేలా చేశారు. అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాత్రం తీర్పుపై స్పందించారు. కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్‌పై పెట్టిన ప్రతి కేసు తప్పుడుదేనని అన్నారు.

Advertisement

KTR: లిక్కర్ కేసులో కవితకు ఊరట.. కోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే!

అందరూ ఒక్కటే అని విమర్శ వస్తుందనా?

కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో కేసీఆర్‌ను దోషిగా తేల్చడంపై కవిత ఘాటుగానే స్పందించారు. హరీశ్ రావు వల్లనే కేసీఆర్‌కు మచ్చ వచ్చిందని ఫైర్ అయ్యారు. హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండాలని తన సోదరుడు కేటీఆర్‌కు సైతం పలుమార్లు సూచించారు. అప్పుడు కవిత బీఆర్ఎస్‌తోనే ఉన్నారని విమర్శలు వచ్చాయి.ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఆమెకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తే కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కటేనని.. జనాలను డైవర్ట్ చేయడానికి కవిత బయటకు వచ్చి రాజకీయాల పేరిట డ్రామాలకు తెరలేపిందని ఎక్కడా టాక్ వస్తుందో అని వారు సైలెంట్ అయ్యారనే చర్చ జోరుగా జరుగుతున్నది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×