E-Paper
Advertisement

Telangana Politics: కడియం బాటలో దానం నాగేందర్.. స్పీకర్ నోటీసుపై రియాక్ట్

Telangana Politics: కడియం బాటలో దానం నాగేందర్..  స్పీకర్ నోటీసుపై రియాక్ట్
Advertisement

Telangana Politics: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఆదివారంతో గడువు ముగిసిందా? ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి..  స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాటేంటి? ఆయన కూడా కడియం బాటలో నడుస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

స్పీకర్ నోటీసుపై దానం నాగేందర్ లేఖ

Advertisement

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? మిగతా ఎమ్మెల్యేల మాట ఎలావున్నా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఇప్పుడు వారి మద్దతుదారుల్లో టెన్షన్ నెలకొంది.

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసుకు స్పందించారు ఎమ్మెల్యే దానం నాగెందర్. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. ఆయన నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్టు సమాచారం.అయితే స్పీకర్‌కు ఎమ్మెల్యే దానం ఏ విధంగా లేఖ రాశారు? కడియం శ్రీహరి మాదిరిగానే వివరణ చెప్పేందుకు తనకు కొంత సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది.

Advertisement

గడువు కావాలని స్పీకర్‌కు లేఖ

అయితే నోటీసులకు స్పందించిన స్పీకర్, ఎంత సమయం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది కీలకంగా మారింది. ఇప్పటికే దానం ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలను కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే తెలంగాణ కాంగ్రెస ప్రముఖులను కలిసి, వారి నుంచి సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: హైదరాబాద్ పోలీసులు అదిరిపోయే డ్యాన్స్.. ఇదిగో వీడియో

మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారిలో ఎనిమిది మంది ఇప్పటికే స్పీకర్‌ నోటీసులకు స్పందించారు. వారంతా తమ వివరణ ఇచ్చుకున్నారు. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలివున్నారు. డిసెంబర్‌లో సుప్రీంకోర్టు బీఆర్ఎస్ వేసిన ధిక్కార పిటిషన్ మళ్లీ విచారణకు రానుంది. ఆలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×