E-Paper
Advertisement

కూకట్‌పల్లి ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై డీసీపీ స్పై ఆపరేషన్.. 9 మంది అరెస్ట్!

కూకట్‌పల్లి ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై డీసీపీ స్పై ఆపరేషన్.. 9 మంది అరెస్ట్!
Advertisement

Kukatpally Pub: కూకట్‌పల్లిలోని ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై సైబరాబాద్ లేడీ డీసీపీ రీతిరాజ్ ఐపీఎస్ చేసిన సాహసోపేతమైన స్పై ఆపరేషన్ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలను తలపించేలా సాగిన ఈ రియల్ లైఫ్ ‘లేడీ సింగం’ యాక్షన్ ప్లాన్ మామూలుగా లేదు.

కస్టమర్‌లా వెళ్లిన డీసీపీ

Advertisement

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో డీసీపీ రీతిరాజ్ రంగంలోకి దిగారు. అయితే సాధారణ పోలీసులా కాకుండా, ఆమె ఒక ప్లాన్ ప్రకారం తన సెక్యూరిటీని దూరంగా పెట్టేశారు. అర్ధరాత్రి సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఒంటరిగా, ఒక సాధారణ కస్టమర్‌లా నేరుగా పబ్‌లోకి ఎంటర్ అయ్యారు.

సీక్రెట్ షూటింగ్.. లైవ్ ఆధారాలు

Advertisement

పబ్‌లో అనుమతించిన సమయాన్ని మించి వ్యాపారం సాగిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు నిబంధనలకు విరుద్ధంగా డాన్స్ ఫ్లోర్లు ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ జరుగుతున్న ఈ ‘గలీజ్ దందా’ మొత్తాన్ని డీసీపీ రీతిరాజ్ తన మొబైల్‌లో సీక్రెట్‌గా షూట్ చేసి, పక్కా ఆధారాలను సేకరించారు.

లోకల్ పోలీసులపై ఫైర్.. అరెస్టులు

ఆధారాలు రికార్డ్ కాగానే ఆమె స్థానిక పోలీసులను అక్కడికి రప్పించి ఆకస్మిక సోదాలు చేయించారు. తన పరిధిలో ఇంత జరుగుతున్నా పట్టించుకోనందుకు స్థానిక పోలీసులపై డీసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పబ్ మేనేజర్‌తో పాటు నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్లి పబ్‌ గుట్టు రట్టు చేసిన లేడీ డీసీపీ ధైర్యానికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

Also Read: బీజేపీ తలుచుకుంటే మంత్రులు ఇళ్లు దాటలేరు.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×