E-Paper
Advertisement

Cyberabad CP Ramesh: ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ రమేష్!

Cyberabad CP Ramesh: ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ రమేష్!
Advertisement

Cyberabad CP Ramesh: మేడ్చల్ స్వేచ్ఛ : ఎల్లంపేట మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, బ్యాలెట్ బాక్స్‌ల పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా డబిల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన సీపీ రమేష్, పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్న బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల కిట్లు, ఇతర అవసరమైన సామగ్రి పంపిణీ విధానాన్ని సమీక్షించారు. పంపిణీ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవ్యవస్థలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు.

Also Read: RITES Recruitment: బరాబర్ రూ.2లక్షల జీతం భయ్యా.. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు..!

భద్రతా ఏర్పాట్లపై అధికారులను ఆరా

Advertisement

అనంతరం కౌంటింగ్ సెంటర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన సీపీ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద తగిన పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రవేశ–నిష్క్రమణ నియంత్రణ వంటి అంశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీపీ రమేష్ సూచించారు.

కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి 

శాంతి భద్రతలు కాపాడటం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతగా భావించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం డబిల్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన సీపీ రమేష్, అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో మాట్లాడి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి పురుషోత్తం, ఏసిపి శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, డి ఐ కిరణ్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Also Read: Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే 123 పట్టణ సంస్థలకు పోలింగ్

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×