E-Paper
Advertisement

Viral Video: హోటల్‌కి వెళ్లి తింటున్నారా.. కస్టమర్స్ మిగిల్చిన చట్నీని ఏం చేస్తున్నారో చూడండి..?

Viral Video: హోటల్‌కి వెళ్లి తింటున్నారా.. కస్టమర్స్ మిగిల్చిన చట్నీని ఏం చేస్తున్నారో చూడండి..?
Advertisement

Viral Video: హైదరాబాద్లో ఫుడ్ కోసం హోటల్స్ కు వెళుతున్నారా అయితే జర జాగ్రత్త. బిజీబిజీగా ఉండే నగరవాసులు నలుగురు ఒక్కచోట చేరితే చాలు.. భోజనం కోసం రెస్టారెంట్లకు, హోటల్లకు వెళుతూ ఉంటారు. ఇక తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ముందూ వెనకా ఆలోచించకుండా లాగించేస్తారు. అయితే అలాంటి వారు ఇప్పుడు కాస్త ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

సాధారణంగా కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసి తిన్న తరువాత వారు వదిలేసి వెళ్లిన ఫుడ్ ను డస్ట్ బిన్ లో పడేస్తారు సిబ్బంది. కానీ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ సిబ్బంది చేసిన పనికి అంతా హోటల్ కు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

Hyderabad Hotels
Hyderabad Hotels
Advertisement

బేగంపేట్ లోని ఓ ప్రముఖ హోటల్ లో కస్టమర్లు తిన్న తర్వాత మిగిలిపోయన చట్నీ, సాస్ లను సిబ్బంది రెస్టారెంట్ లోని కిచన్ లోకి తీసుకువెళ్లి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టారు. అయితే దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

చాలా హోటల్స్ లో ఇలా కస్టమర్లు తినగా మిగిలిన పదార్థాలను సిబ్బంది వేరే వారికి వడ్డిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేప్టీ అధికారులు ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. ఫుడ్ సేప్టీ అధికారులు త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటారని వెల్లడించింది.

Advertisement

Also Read: గోల్డ్, సిల్వర్ పానీపూరీ.. ఎప్పుడైనా దీన్ని టేస్ట్ చేశారా?

అక్కడక్కడా కుళ్లిన మాంసంతో బిర్యాణి చేసి వడ్డించిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఈ సంఘటనపై ఓ వ్యక్తి జీహెచ్ ఎంసీకి ట్యాగ్ చేయగా.. దీనిపై జీహెచ్‌ఎంసీ స్పందించింది. త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×