E-Paper
Advertisement

Mahabubabad Municipal: కాంగ్రెస్. సీపీఐ పొత్తు బ్రేక్.. బీఆర్ఎస్‌తో సీపీఐ ఒప్పందం.. మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్ట్!

Mahabubabad Municipal: కాంగ్రెస్.  సీపీఐ పొత్తు బ్రేక్.. బీఆర్ఎస్‌తో సీపీఐ ఒప్పందం.. మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్ట్!
Advertisement

Mahabubabad Municipal:  మహబూబాబాద్ స్వేచ్ఛ: 2014 మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన సిపిఐ  నేడు కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య ఒత్తులు కుదరకపోవడంతో కాంగ్రెస్ ను స్కిప్ చేసి వైపు సిపిఐ పార్టీ స్టెప్ తీసుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో సమన్వయం కుదుర్చుకునేందుకు  రాత్రి చర్చలు జరిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయని సిపిఎం కలిసిపోతే, సపోర్టు చేసిన సిపిఐ పార్టీ మాత్రం కలవకుండా మొండికేసింది. హైదరాబాదు నుండి మహబూబాబాద్ వరకు, కాంగ్రెస్ హై కమాండ్ నుండి ఎమ్మెల్యే వరకు పలుమార్లు చర్చలు జరిపిన సిపిఐ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వార్డులకు సంతృప్తి చెందలేదు. దీంతో ఎవరి నామినేషన్ల ప్రక్రియ ప్రకారం వారు ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక చేసుకున్నారు.

సీపీఐ చర్చలు

సాయంత్రం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇన్చార్జి దాస్యం వినయ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో వామపక్షాలు వస్తే కలుపుకు పోతామని హింట్ ఇచ్చారు. దీంతో కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు సీపీఐ పార్టీ నాయకులను సంప్రదించి చర్చలు జరిపేందుకు ఒప్పించారు. ఈ క్రమంలోనే సిపిఐ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీతో మునిసిపాలిటీ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు సుముఖం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల పరస్పర అంగీకారంతో ఒప్పందానికి వచ్చారు. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ పూర్తి కావడంతో సిపిఐ పార్టీ బలంగా ఉన్న వార్డుల్లో బీఆర్ఎస్ సపోర్టు, బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉన్న వార్డుల్లో సిపిఐ పార్టీ పరస్పర సహకారం అందించుకునేందుకు ప్రణాళిక రచించుకున్నారు.

Advertisement

Also ReadMahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10 సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!

పొత్తులు కుదరక కారెక్కిన సిపిఐ

మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి సిపిఐ, కాంగ్రెస్ పార్టీలో మధ్య వార్డుల సర్దుబాటు ప్రక్రియ చర్చలు మొదలయ్యాయి. 13 సీట్ల నుంచి 10 సీట్లకు, 10 సీట్ల నుంచి 9 సీట్లకు, 9 సీట్ల నుంచి 8 సీట్లకు, 8 సీట్ల నుంచి 7 సీట్లకు ఫైనల్ గా 6 సీట్లు సిపిఐ పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీకి నాలుగు సీట్లు ఇచ్చాం.. మరో సీట్లో ఫ్రెండ్లీ పోటీకి అంగీకరించామని, అదేవిధంగా సిపిఐ పార్టీకి కూడా సహకారం అందిస్తామని స్థానిక డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే మురళి నాయకులు విజ్ఞప్తి చేశారు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో సిపిఐ పార్టీ నాయకులు విభేదించారు. ఆగ్రహించిన సిపిఐ పార్టీ నాయకులు స్వతహాగా సిపిఐ పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయమై రహదారిపై నినాదాలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకమైన నినాదాలు చేసి తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు.

కాంగ్రెస్ వైపు సిపిఎం.. బీఆర్ఎస్ వైపు సిపిఐ

Advertisement

మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీల మార్పు తీవ్ర కలకలం రేపుతోంది. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి పొత్తులు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేసిన సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీని విభేదించిన సిపిఎం పార్టీ చివరకు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తో నాలుగు సీట్లలో పోటీ చేసేందుకు సంసిద్ధులు అయ్యారు. మరొక సీటులో ఫ్రెండ్లీ పోటీకి అంగీకరించారు. ఇదే పద్ధతిన సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది. కానీ, సిపిఎం పార్టీ ఎలాంటి సహకారం అందించకుండా వారికి నాలుగు సీట్లు, సహకారం అందించిన సిపిఐ పార్టీకి కూడా నాలుగు సీట్లు అంగీకరిస్తారా..? అంటూ ప్రశ్నించారు. సిపిఐ పార్టీకి ఐదు సీట్లు కేటాయిస్తే, సిపిఎం పార్టీ కూడా ఐదు సీట్లు అడిగే అవకాశం ఉన్నందున సిపిఐ పార్టీకి అడిగిన సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదు. దీంతో సిబిఐ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి వినయ్భాస్కర్ నేతృత్వంలో చర్చలు జరిపి సమన్వయ అంగీకారంతో ముందుకు వెళ్లేందుకు ఒప్పుకున్నారు.

Also Read: Mahabubabad News: తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో బావిలో పడి తండ్రీకొడుకుల మృతి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×