E-Paper
Advertisement

Nandakumar : నందకుమార్‌కు కోర్టులో ఊరట.. ఆ కేసులో బెయిల్‌ మంజూరు..

Nandakumar : నందకుమార్‌కు కోర్టులో ఊరట.. ఆ కేసులో బెయిల్‌ మంజూరు..
Advertisement

Nandakumar : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ కు కోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఫోర్జరీ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరో కేసులో నందకుమార్‌పై పీటీ వారెంట్‌ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. నందకుమార్‌పై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని పోలీసులను న్యాయస్థానం కోరింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నందకుమార్‌ చాటింగ్‌ లో ప్రస్తావించిన పేర్లు కాంగ్రెస్ లో గుబులు రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్లను నందకుమార్ చాటింగ్ లో ప్రస్తావించారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఎంత మందిని టార్గెట్‌ చేశారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

ఈ నేతలందరూ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ను వీడరని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విభిన్న కోణాలు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలిమిర.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×