E-Paper
Advertisement

New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

New Secretariat : కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై రగడ.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్..
Advertisement

New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వివాదం రాజేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గాంధీభవన్ నుంచి కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంపై వెలువడుతున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని మండిపడ్డారు.

మరోవైపు అగ్ని ప్రమాదం జరగలేదని మాక్ డ్రిల్ మాత్రమే నిర్వహించామని పోలీసులు అంటున్నారు. ఇంకోవైపు సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ప్రకటించారు. ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయని తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు భిన్నప్రకటనలు చేయడంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. తాము ఘటనాస్థలికి వెళ్లి తెలుసుకుంటామని పట్టుబట్టారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మల్లురవి, షబ్బీర్ అలీని గాంధీభవన్ వద్దే అరెస్టు చేశారు. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేతలను అరెస్టు చేసిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

రేవంత్ ట్వీట్..
కొత్త సెక్రటేరియట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అగ్ని ప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసి మారేడు కాయ చేయడం తప్పని మండిపడ్డారు. కేసీఆర్ పుట్టిన రోజే ప్రారంభించాలనే ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడానికి ఇదేమైన రాచరికమా అని రేవంత్ ప్రశ్నించారు. అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×