E-Paper
Advertisement

Janagama : జనగామ టిక్కెట్ పంచాయితీ.. బీఆర్ఎస్ లో జగడం..

Janagama : జనగామ టిక్కెట్ పంచాయితీ..  బీఆర్ఎస్ లో జగడం..
Advertisement

Janagama : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. జనగామలో రాజకీయ జగడం ముదిరింది. నియోజకవర్గంలో టికెట్‌ పంచాయితీ తీవ్రమైంది. బీఆర్‌ఎస్‌లో టికెట్‌ కొట్లాటతో వర్గపోరు భగ్గుమంటోంది. జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఈ సారి పక్కకు పెడతారని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో MLC పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలో నిలుపుతారని అంటున్నారు. ముత్తిరెడ్డికి భూవివాదాలు, కూతురు విమర్శలు ప్రతికూలంగా మారాయని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముత్తిరెడ్డికి టికెట్‌ కష్టమేనని జనగామ బరిలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉంటారని మరికొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జడ్పీ ఛైర్మన్‌, ఓ జెడ్పీటీసీతో ఫోన్‌ మాట్లాడిన ఆడియో రికార్డ్‌ వైరల్‌ అయింది. ముత్తిరెడ్డికి టికెట్‌ కష్టమేనని, పల్లా రాజేశ్వర్‌రెడ్డి బరిలో దిగుతారని ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్టు ఆడియోలో ఉంది.

Advertisement

టికెట్‌ విషయంపై ముత్తిరెడ్డి కూడా స్పందించారు. టికెట్‌ మళ్లీ తనకే వస్తుందని పలు వేదికలపై చెబుతున్నారు. కేసీఆర్‌ తనకు హామీ ఇచ్చారని అంటున్నారు. అలాగే తాజాగా ముత్తిరెడ్డికి మద్దతుగా కూడా సర్పంచులు మాట్లాడుకున్న ఆడియో రిజీల్‌ అయింది. పల్లాకు వ్యతిరేకంగా, ముత్తిరెడ్డికి అనుకూలంగా అందులో సర్పంచ్‌లు మాట్లాడుకున్నట్టు ఉంది.

ముత్తిరెడ్డి, పల్లా అనుచరులు పరస్పరం పోటాపోటీగా ఆడియోలు రిలీజ్‌ చేస్తున్న వేళ… జనగామ రాజీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు టికెట్‌ తమకే అంటూ ప్రజల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అధిష్ఠానం మనసులో ఏముందో తేలాల్సి ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×