E-Paper
Advertisement

Rolex Watch Theft Case: కానిస్టేబులే దొంగ.. రోలెక్స్ వాచ్‌ను ఎలా కాజేశాడంటే..!

Rolex Watch Theft Case: కానిస్టేబులే దొంగ.. రోలెక్స్ వాచ్‌ను ఎలా కాజేశాడంటే..!
Advertisement

Rolex Watch Theft Case: రోలెక్స్ వాచ్ దొంగ దొరికేశాడు. ఇతను మరెవరో కాదు కానిస్టేబుల్ చరణ్ గా గుర్తించారు. ఇటీవర కాలంలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ గా చెప్పుకుని తిరుగుతూ.. భారీగా మోసాలు చేస్తున్న శశికాంత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. శశికాంత్ పై ఒక బాధితుడు ఫిర్యాదు చేయడంతో అతడి ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు ఫిల్మింనగర్ పోలీసులు.

పోలీసుల కథనం ప్రకారం.. సోదాల సమయంలో తాను తీస్తున్న వీడియో ఫ్రేమ్‌లో ఆ వాచ్ కనిపించకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్న శరణ్, అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ వాచ్‌ను తన జేబులో వేసుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం అప్పట్లో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ అదే ఆపరేషన్‌కు సంబంధించిన మరో కానిస్టేబుల్ మొబైల్‌తో తీసిన వీడియోలో శరణ్ వాచ్‌ను జేబులో వేసుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి. ఆ వీడియో ఆధారంగా సీనియర్ అధికారులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

వాచ్ మాయమైనట్లు ఫిర్యాదు రావడం, మరో వీడియో ఆధారాలు బయటపడటంతో పోలీసులు శరణ్‌ను విచారించారు. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఆధారాలు చూపించడంతో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయం బయట పడడంతో పోలీసులు శశికాంత్ కుటుంబ సభ్యులకు వాచ్ వాపస్ చేసి కాంప్రమైజ్ చేసుకున్నారు.

ఈ వ్యవహారం బయటపడటంతో పోలీస్‌ శాఖ ప్రతిష్టకు భారీ దెబ్బ తగిలింది. నేరస్ధులను పట్టుకోవాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తే నేరానికి పాల్పడటం పట్ల ఉన్నతాధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చట్టానికి అతీతంగా ఎవరు ఉన్నా చర్యలు తప్పవన్న సంకేతాలను పోలీసులు ఈ ఘటన ద్వారా స్పష్టం చేస్తున్నారు. కేసు నమోదు అనంతరం శరణ్‌ను న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలియజేశారు.

Advertisement

Also Read: పాతబస్తీలో పేలుడు.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ వీడియో

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్రిమినల్ కేసుతో పాటు డిసిప్లినరీ యాక్షన్ కూడా తప్పదని అధికారులు స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×