// // Telangana Panchayat Elections - పల్లె పోరులో కాంగ్రెస్ జయభేరి.. 2383 అభ్యర్థుల గెలుపు -->
E-Paper
Advertisement

Telangana Panchayat Elections: పల్లె పోరులో కాంగ్రెస్ జయభేరి.. 2383 అభ్యర్థుల గెలుపు

Telangana Panchayat Elections: పల్లె పోరులో కాంగ్రెస్ జయభేరి.. 2383 అభ్యర్థుల గెలుపు
Advertisement

Telangana Panchayat Elections: తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. గురువారం జరిగిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో విజయదుందుభి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టిపోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3వేల 835 సర్పంచ్, 27వేల 678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా యాదాద్రిలో 92.88శాతం నమోదైంది.

రాష్ట్రంలో మొత్తం 53 లక్షల 57వేల 277 మందికి గాను 45లక్షల 15వేల 141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటల్లోనూ 90 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. నల్గొండ 193, ఖమ్మం 136, మెదక్ 107, యాదాద్రి 84, వరంగల్ 55, ఆదిలాబాద్ 74, సూర్యాపేట 92, కరీంనగర్ 34, కామారెడ్డి 69, జనగామ 63, నాగర్‌కర్నూల్ 94, నారాయణపేట 48, నిజామాబాద్ 136, నిర్మల్ 60, పెద్దపల్లి 58, మంచిర్యాల 49, రాజన్నసిరిసిల్ల 44, వికారాబాద్ 173, ములుగు 34, జయశంకర్‌ భూపాలపల్లి 46, జగిత్యాల 54 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనపరచింది. సిద్దిపేట జిల్లాలో 79 స్థానాలతో బీఆర్ఎస్ ముందుంది.

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 67 స్థానాలకు గాను 47 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 340 స్థానాలకు గాను 193 స్థానాల్లో గెలిచి విజయ దుందుభి మోగించింది. రెండో విడత ఎన్నికల్లో ఏ పార్టీ అగ్రస్థానంలో నిలుస్తుందో వేచి చూడాలి.

జిల్లాల వారీగా ఫలితాలు

Advertisement

ఉమ్మడి మెదక్ జిల్లా – కాంగ్రెస్ ఆధిపత్యం

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 459 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ ఆదిపత్యం సాధించింది.

కాంగ్రెస్ – 251

బీఆర్‌ఎఎస్ – 157

బీజేపీ – 13

ఇతరులు – 38

సిద్దిపేట జిల్లా (163 పంచాయతీలు)

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

BRS – 77

INC – 60

BJP – 11

IND – 15

సంగారెడ్డి జిల్లా (136 పంచాయతీలు)

INC – 82

BRS – 41

BJP – 2

IND – 11

వరంగల్, ములుగు, భూపాలపల్లి – కాంగ్రెస్ పునరాగమనం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ భారీ విజయం సాధించింది.

వరంగల్ జిల్లా (91 స్థానాలు)

INC – 57

BRS – 26

BJP – 3

Others – 5

హనుమకొండ (69 స్థానాలు)

INC – 26

BRS –19

BJP –10

Others –14

జనగామ జిల్లా (110 స్థానాలు)

INC –76

BRS –25

IND –9

ములుగు జిల్లా (48 స్థానాలు)

INC –35

BRS –12

IND –1

భూపాలపల్లి జిల్లా (82 స్థానాలు)

INC –49

BRS –23

BJP –3

Others –7

పాలమూరు జిల్లాలు – కాంగ్రెస్ స్వీప్ మోడ్‌లో

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాలలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

మహబూబ్ నగర్ (139 పంచాయతీలు)

INC –66

BRS –57

BJP –4

IND –12

నాగర్ కర్నూల్ (151 పంచాయతీలు)

INC –92

BRS –45

BJP –4

IND –10

నారాయణపేట (67 పంచాయతీలు)

INC –51

BRS –9

BJP –2

IND –5

వనపర్తి (87 పంచాయతీలు)

INC –48

BRS –32

BJP –3

IND –4

జోగులాంబ గద్వాల (106 పంచాయతీలు)

INC –73

BRS –6

BJP –8

IND –18

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×