E-Paper
Advertisement

Bheri Suspension: మేడ్చల్ కాంగ్రెస్‌లో సస్పెన్షన్ వేటు కలకలం.. పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు!

Bheri Suspension: మేడ్చల్ కాంగ్రెస్‌లో సస్పెన్షన్ వేటు కలకలం.. పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు!
Advertisement

Bheri Suspension: స్వేచ్చ బ్యూరో: గుండ్లపోచంపల్లి డివిజన్ మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3న పార్టీ నియమావళిని ఉల్లంఘించి, పీసీసీ, డీసీసీ, కమ్యూనికేషన్ కమిటీలను అవమానించే విధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 5న సమర్పించిన వివరణ కూడా పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉండటంతో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Also read: KTR Challenge: కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు.. దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్!

గతంలో షోకాజ్ నోటీసు జారీ..

Advertisement

గుండ్లపోచంపల్లి డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ స్పీకర్లో జిల్లా అధ్యక్షుడితో ఆ విషయం చెప్పకుండా మాట్లాడించారు. అంతే గాకుండా సామాజిక మాధ్యమాల్లో ఇరువురి మధ్య జరిగిన సంభాషణను ప్రచారం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జిల్లా అధ్యక్షుడు సర్పంచ్ బేరి ఈశ్వర్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాన్ని నా ప్రమేయం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బహిర్గతం చేశారన్నారు.

Also read: Singareni Yatra: తెలంగాణ బీజేపీ సంచలన నిర్ణయం.. ఈనెల 13, 14 తేదీల్లో బిగ్ ప్లాన్..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×