E-Paper
Advertisement

Dr Konagala Mahesh: లండన్ డిప్యూటీ మేయర్‌తో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. మహేష్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చ

Dr Konagala Mahesh: లండన్ డిప్యూటీ మేయర్‌తో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. మహేష్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చ
Advertisement

Dr Konagala Mahesh: లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. కొనగాల మహేష్, లండన్ డిప్యూటీ మేయర్ ఎరియన్ అరేటి (Arian Arati)తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు పలు ఆసక్తికర విషయాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను మహేష్ ఆయనకు వివరించారు.

తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మహేష్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైజింగ్ తెలంగాణ – గ్లోబల్ సమ్మిట్’ (Rising Telangana Global Summit) యొక్క ఉద్దేశాలను, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను డిప్యూటీ మేయర్‌కు వివరించారు.

Advertisement

అలాగే, హైదరాబాద్ నగరానికి మణిహారంగా నిలవబోతున్న ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) ప్రాజెక్టు వివరాలను, దాని ద్వారా రాబోయే ఉపాధి అవకాశాలను గురించి చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వినూత్న నిర్ణయాలు, అభివృద్ధి ప్రణాళికల పట్ల లండన్ డిప్యూటీ మేయర్ ఆసక్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే దిశగా ఈ భేటీ జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×