E-Paper
Advertisement

Madira Municipality: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం.. చైర్‌పర్సన్‌గా సామినేని సుజాత ఎన్నిక

Madira Municipality: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం.. చైర్‌పర్సన్‌గా సామినేని సుజాత ఎన్నిక
Advertisement

Madira Municipality:  మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధని కుమార్ ఎన్నికయ్యారు. మధిర ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని తన ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నారు. అంతకుముందు, మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సాదరంగా ఆహ్వానించారు. భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు వారిని అభినందించిన ఆయన, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి కౌన్సిలర్లతో కలిసి  ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.

Also Read: Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్‌లో కాంట్రవర్సీగా మారిన రాజగోపాల్ రెడ్డి వ్వవహరం.. సీఎంపై విమర్శనాస్త్రాలు..!

​ప్రమాణ స్వీకారం.. ఎక్స్ అఫీషియో ఓటు

Advertisement

ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం జరిగిన ప్రక్రియలో భట్టి విక్రమార్క తన ఎక్స్ అఫీషియో ఓటును వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతుతో చైర్‌పర్సన్ పదవికి సామినేని సుజాత, వైస్ చైర్మన్ పదవికి కోన ధని కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నవీన్ బాబు అధికారికంగా ప్రకటించారు.

​అభివృద్ధికి బాటలు వేస్తాం: భట్టి

ఎన్నిక అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మధిర మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా చూస్తామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా  పని చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మధిర క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అభినందించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేయాలని, పారదర్శకతతో ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారిశుధ్యం మరియు తాగునీటి వంటి ప్రాధాన్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులుగా పనిచేస్తూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సమిష్టి కృషితో మధిర అభివృద్ధికి తోడ్పడాలని కౌన్సిలర్లకు మార్గనిర్దేశం చేశారు.

Advertisement

Also ReadTanveer Ahmed: తూచ్ అంతా ఛీటింగే..ఫ‌స్ట్ ఇన్నింగ్ త‌ర్వాత టీమిండియాకు అనుకూలంగా పిచ్ మార్చేశారు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×