E-Paper
Advertisement

LPG Shortage: ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారా? పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ

LPG Shortage: ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారా? పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ
Advertisement

LPG Shortage: దేశంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపై పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలని, తక్షణమే దీనిపై ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని, సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ కొరతను నివారించాలని కోరారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ప్రధాని మాట్లాడకపోవడం విచారకరమని పేర్కొన్నారు. విదేశాంగ విధానంపై నోరు విప్పకుండా ప్రధాని తప్పించుకుంటున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ భయపడుతున్నారని, అందుకే అంతర్జాతీయ వేదికలపై భారత ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నారని చామల ఎద్దేవా చేశారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల ప్రచారాలకే పరిమితం కాకుండా, పార్లమెంట్‌లో ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎల్పీజీ నిల్వలను పెంచి, సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

Also Read: ఆఫీస్ మెట్లు ఎక్కాలంటే ‘ఆమె’ పర్మిషన్ ఉండాల్సిందేనా? వెంకటగిరి టీడీపీలో అసలేం జరుగుతుంది?

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×