E-Paper
Advertisement

దండుపాళ్యం ముఠా అంటేనే బీఆర్ఎస్.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర ధ్వజం

దండుపాళ్యం ముఠా అంటేనే బీఆర్ఎస్.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర ధ్వజం
Advertisement

Congress MLAs vs KTR: వరంగల్ వేదికగా నిర్వహించిన రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి.. నాగరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదుల మీద బతికే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో విస్మరించారని.. అందుకే ఇప్పుడు అధికారం కోల్పోయిన బాధతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన నీచ చరిత్ర.. అన్నదాతలు నిరసన తెలపకుండా అణిచివేసిన నేపథ్యం బీఆర్ఎస్ నేతలదేనని నాయిని విమర్శించారు. దండుపాళ్యం.. చెడ్డిగ్యాంగ్ ముఠా అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబానికి ఒక సవాల్ విసురుతూ.. హన్మకొండ చౌరస్తాలో రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించడానికి సిద్ధమా అని నిలదీశారు. కేటీఆర్‌కు భయం ఉంటే తన ఇంటి వద్దకైనా చర్చకు వస్తానని.. తాను గన్‌మెన్లు లేకుండా వస్తానని.. దమ్ముంటే కేటీఆర్ రావాలని సవాల్ చేశారు. అసాంఘిక శక్తుల కంటే బీఆర్ఎస్ నేతలే సమాజానికి ప్రమాదకరంగా మారారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 80 శాతానికి పైగా రైతు రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసిందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా గుట్టలకు.. వెంచర్లకు కోట్ల రూపాయల రైతుబంధు ఇచ్చే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ తేలేని వరంగల్ ఎయిర్‌పోర్టును.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తాము తెచ్చామని గర్వంగా ప్రకటించారు. ధరణిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు దోచుకున్నారని.. ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైతులను వంచించారని మండిపడ్డారు. తమకు భాష రాక కాదని.. తమది ‘హార్డ్‌వేర్’ అని.. మాట్లాడితే కేటీఆర్ ఇంటి నుంచి బయటకు రాలేడని హెచ్చరించారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కూడా కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అంటే ‘బద్మాష్ రాష్ట్ర సమితి’ అని ఆయన అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతిమయం చేసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ వంటి నాయకులపై వాడే భాష సరిగా లేదని హితవు పలికారు. రైతులను కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని.. రైతులకు గతంలో బేడీలు వేసిన పాపం బీఆర్ఎస్‌దేనని గుర్తు చేశారు. “మీ అయ్య ఫామ్ హౌస్‌లో పడుకుంటే.. నువ్వు పబ్బుల్లో తిరుగుతున్నావు” అని కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని తాము సైలెంట్‌గా ఉంటున్నామని.. లేదంటే కేటీఆర్‌ను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. కేటీఆర్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే ప్రజల చేత బుద్ధి చెప్పిస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Read Also: అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి.. కానీ పేదలకు ఉచిత విద్య ఇవ్వండి.. కవిత సంచలన సవాల్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×