E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్ ‘యువ సంఘర్షణ సభ’.. ప్రియాంకగాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’..

Congress: కాంగ్రెస్ ‘యువ సంఘర్షణ సభ’.. ప్రియాంకగాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’..
Advertisement

Congress: ప్రియాంకగాంధీ రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ నెల 8 న సరూర్ నగర్ లో నిర్వహించనున్న సభ కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గాంధీభవన్ లో టీపీసీసీ సమావేశమైంది. సభ ఏర్పాట్లు, ప్రియాంక గాంధీ స్పీచ్ పై చర్చించారు. సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆ తర్వాత సరూర్ నగర్ లో సభ ఏర్పాట్లను పరిశీలించారు.

తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ కనిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ఎటాక్ చేస్తున్న హస్తం పార్టీకి.. మరింత బూస్ట్ ఇచ్చేలా.. ఏకంగా ఆ పార్టీ అగ్రనేత రాష్ట్రానికి రానున్నారు. సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ.. ఈ నెల 8 న హైదరాబాద్ కు రానున్నారు. ఆ రోజు సరూర్ నగర్ లో జరిగనున్న యువ సంఘర్షణ సభలో ఆమె మాట్లాడనున్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్.. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

ప్రియాంక సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు.. సభను విజయవంతం చేసేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం గాంధీభవన్ లో టీ పీసీసీ పీఈసీ సమావేశం అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు.. పార్టీ సీనియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ సక్సెస్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

గతంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేశారని.. ఇప్పుడు సరూర్ నగర్ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ చేస్తారని.. పార్టీ నేతలు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్లంతా సరూర్ నగర్ స్టేడియానికి వెళ్లారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ ప్రారంభం కానుండటంతో.. ఒకరోజు ముందే పనులన్నీ పూర్తయ్యేలా.. ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ వార్ కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే నిరుద్యోగ నిరసన సభల పేరుతో.. పలుచోట్ల యువతను ఏకం చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ప్రియాంకగాంధీ కూడా ఎంటర్ కావడంతో.. రాష్ట్ర క్యాడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముందు ముందు మరిన్ని అంశాలపై దాడిని కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×