E-Paper
Advertisement

KTR రాజకీయంగా నీదే క్రాస్ బ్రిడ్.. ఎమ్మెల్యే సంజయ్ హాట్ కామెంట్స్

KTR రాజకీయంగా నీదే  క్రాస్ బ్రిడ్.. ఎమ్మెల్యే సంజయ్ హాట్  కామెంట్స్
Advertisement

Congress Leaders Press Meet: జగిత్యాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేపు జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించబోయే సభపై వారు పలు ప్రశ్నలు సంధిస్తూ, కేటీఆర్ అహంకారపు మాటలకు కాలం చెల్లిందని హెచ్చరించారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ శైలిపై నిప్పులు చెరిగారు. “కేటీఆర్.. నీది క్రాస్ బ్రిడ్ రాజకీయమా? కేసీఆర్, కేటీఆర్ మీ స్వార్థ రాజకీయాల వల్లే వెలమ జాతి పరువు పోయింది.” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కేటీఆర్ అహంకారం, అవినీతి అక్రమ సంపాదన, అహంకారపు మాటలే ప్రధాన కారణమని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గౌడ్‌కు టికెట్ ఇచ్చి జీవన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ క్రాస్ ఓటింగ్ చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న చరిత్ర మీదని, అప్పట్లో మీది ఏ కొంప అని అడగాలా అని తీవ్రంగా మండిపడ్డారు.

బీఆర్ఎస్, బీజేపీలది ఫెవికల్ బంధం విప్: ఆది శ్రీనివాస్

Advertisement

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కేటీఆర్, హరీష్ రావులకు అధికారం మీద ఉన్న ఆశ తప్ప ప్రజల సమస్యల మీద శ్రద్ధ లేదని విమర్శించారు. వీరిద్దరూ పచ్చి అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ‘గుండు సున్నా’ రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరని, తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి ఆరు నెలలకోసారి అసెంబ్లీకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను మొదట ఖండించింది కాంగ్రెస్ పార్టీయేనని, బీఆర్ఎస్-బీజేపీల మధ్య అంతర్గతంగా ‘ఫెవికల్ బంధం’ ఉందని ఆరోపించారు.

గాలి మోటార్ మీద రావడం కాదు.. అభివృద్ధి చూడు: మంత్రి అడ్లూరి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రేపటి సభ కేవలం 15 వేల మందితో డ్రోన్ కెమెరాల కోసం చేసే ‘డబ్బా’ సభ అని కొట్టిపారేశారు. గతంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే రాని కేసీఆర్, ఇప్పుడు గాలి మోటార్ మీద వస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే ధర్మపురికి రావాలని, అక్కడ జరిగిన అభివృద్ధిని తాను చూపిస్తానని సవాల్ విసిరారు. సిరిసిల్లలో నేరెళ్ల దళితులకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడటం నేర్చుకోవాలని, అక్రమ సంపాదనతో సభలు పెడుతూ విషం చిమ్మడం మానుకోవాలని హితవు పలికారు. రేపటి సభ జీవన్ రెడ్డి గారి చేరిక సభనా లేక బహిరంగ సభనా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Read Also: తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×