E-Paper
Advertisement

PAC Meeting: తెలంగాణ పీఏసీ మీటింగ్.. సంకేతాలు ఇచ్చిన కేసీ వేణుగోపాల్

PAC Meeting: తెలంగాణ పీఏసీ మీటింగ్.. సంకేతాలు ఇచ్చిన కేసీ వేణుగోపాల్
Advertisement

PAC Meeting: ప్రభుత్వానికి- పార్టీకి మధ్య సమన్వయం కచ్చితంగా ఉండాలని తేల్చి చెప్పేశారు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలన్నది సమావేశంలో ప్రధాన హైలైట్. ఏడాది ప్రభుత్వ పాలన బాగుందని, ఇంకా మెరుగ్గా చేయాలన్నారు.

పార్టీ నేతలు, మంత్రుల పని తీరును విశ్లేషించిన ఆయన, చాలామంది నేతలు, మంత్రులు క్షేత్రస్థాయిలో తిరగలేదన్న విషయాన్ని గుర్తు చేశారు కేసీ వేణుగోపాల్. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని, భారీగా పథకాలు అమలు చేస్తున్నా, ప్రజలకు ఎందుకు వివరించలేక పోతున్నారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Advertisement

కేవలం ముఖ్యమంత్రి సభలు ఒక్కటే సరిపోతుందన్నారు ఏఐసీసీ కార్యదర్శి. బుధవారం సాయంత్రం గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి 23 మంది కమిటీ సభ్యులు, మంత్రులు, మాజీ పీసీసీలు, మాజీ సీఎల్పీ నేతలు హాజరయ్యారు.

ఈ ఏడాదిని పార్టీ సంస్థాగత నిర్మాణ సంవత్సరంగా తీసుకోవాలని సూచన చేశారు కేసీ వేణుగోపాల్. ముఖ్యంగా పంచాయితీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. కేవలం నెల రోజుల్లోపు కమిటీలు వేయాలన్నారు. ఇకపై ప్రతీ నెలలా పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

Advertisement

ALSO READ: ఏసీబీ ముందుకు కేటీఆర్.. గుట్టు విప్పిన అరవింద్‌ కుమార్, ఇక మిగిలింది

వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీవర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. లేదంటే దీని ప్రభావం ఆయా ఎన్నికలపై పడే అవకాశముందన్నారు. ఈనెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్ లో సంవిధాన్ బచావ్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు పీసీసీ తెలిపింది.

ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనను వేణుగోపాల్ ప్రశంసించారు. దేవాదాయ శాఖలో కార్యకర్తలకు సముచిత స్థానం ఇకపై ఇవ్వనుంది. ఇటీవల బెల్గాంలో జరిగిన ఏఐసీసీ మావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది పీఏసీ కమిటీ. దాదాపు రెండుగంటలపాటు జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×