E-Paper
Advertisement

Congress: కేటీఆర్‌కు ఢిల్లీలో పనేంటి? బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కోసమే.. థాక్రే లీక్స్..

Congress: కేటీఆర్‌కు ఢిల్లీలో పనేంటి? బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కోసమే.. థాక్రే లీక్స్..
Advertisement
ktr delhi

Telangana congress latest news(Telugu flash news) : తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నీ వాలిడ్ ప్రశ్నలే. ప్రజల్లో ఉన్న అనుమానాలే.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు?.. నాలుగేళ్లుగా లేనిది మంత్రి కేటీఆర్ ఇప్పుడే ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? కేంద్ర మంత్రులను ఎందుకు కలిశారు? వారి భేటీ వెనుక ఆంతర్యం ఏంటి? ఇవీ థాక్రే లేవనెత్తిన ప్రశ్నలు.

Advertisement

తన ప్రశ్నలకు ఆయనే సమాధానం కూడా చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్‌ పొత్తు పెట్టుకోబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మాణిక్ రావు థాక్రే. పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతున్న సమయంలోనే.. ఢిల్లీలో బీఆర్ఎస్‌ నేతలు బీజేపీతో మంతనాలు జరుపుతుండటం పొత్తుల కోసమేనన్నారు.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం పెరిగిందన్నారు థాక్రే. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు బిజెపి, బీఆర్ఎస్ రెండు పార్టీల నుంచి చాలామంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు మాణిక్ రావ్ థాక్రే.

Advertisement

శుక్రవారం ఉదయం.. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు కేటీఆర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ భూములపై తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా.. ఇప్పటికీ ఒప్పుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే.. 40 పైసలే తిరిగి వస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన నిధుల గురించి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని తప్పుబట్టారు కేటీఆర్.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×