E-Paper
Advertisement

CM Revanth Reddy: కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్? మూడు సర్వేల్లోనే లీడ్ .. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు!

CM Revanth Reddy: కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్?  మూడు సర్వేల్లోనే లీడ్ .. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు!
Advertisement

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్కు కాన్ఫిడెన్స్ పెరిగింది. పార్టీ, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన మూడు సర్వేల్లోనే మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నట్లు తేలింది. దీంతో నేతలంతా ఎన్నికల కంటే ముందే సంబరపడుతున్నారు. అయితే ఫలితాలు తేలేంత వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని సీఎం నొక్కి చెప్పారు. సోమవారం ఆయన మంత్రులు, కో ఆర్డినేటర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..పోలింగ్, రిజల్ట్స్ ప్రకటన వరకు నేతలంతా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఇక పోలింగ్ ముగిసే వరకు మంత్రులంతా జిల్లాల్లోనే ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు నేతలతో సమన్వయం చేయాలన్నారు.

Also Read: CM Revanth Reddy: ప్రజాపాలన – ప్రగతి బాట.. తెలంగాణా పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ స్పీడ్!

Advertisement

పాత, కొత్త నేతలు సమన్వయంతో ఓటర్లను ప్రభావితం చేయాలన్నారు. రెండేళ్ల పరిపాలనపై పబ్లిక్ పాజిటివ్ వైబ్ తో ఓట్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తీసుకువెళ్తేనే మైలేజ్ వస్తుందని సీఎం వివరించారు. సర్వేల్లో ప్రధానంగా ​ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల్లో ఉన్న సానుకూలత కనిపించినట్లు లీడర్లు చెప్తున్నారు. దీంతో గత ఎన్నికల కంటే మెరుగైన ఓటు బ్యాంకు వృద్ధి చెందినట్లు నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ఏరియాల్లోనూ ఈ దఫా ఓట్ షేర్ భారీగా పెరినట్లు సర్వే డేటాపై కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రూరల్ ప్రాంతాల్లోనే పార్టీ సత్తా చాటగా, ఈ దఫా మున్సిపల్ ఎన్నికల్లో అర్భన్ ఓటర్లూ తమకు మద్ధతిస్తున్నట్లు పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అప్రమత్తంగా ఉండాల్సిందే!

​సర్వేలు అనుకూలంగా ఉన్నాయని రిలాక్స్ కావద్దని ముఖ్యమంత్రి తన టీమ్‌ను హెచ్చరించారు.గెలుస్తున్నామనే నమ్మకంతో లైట్ తీసుకోవదన్నారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఓటర్లు చీలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం నుంచి, స్థానిక సమస్యల పరిష్కారం వరకు మంత్రులే బాధ్యత వహించాలన్నారు. కింది స్థాయి నాయకులలో అసంతృప్తి ఉంటే వాటిని వెనువెంటనే చక్కదిద్దాలని సీఎం సూచించారు.పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఏ మంత్రి కూడా రాజధానికి రావొద్దని, తమకు కేటాయించిన జిల్లాల్లోనే మకాం వేయాలని సీఎం ఆదేశించారు. లాస్ట్ మినిట్ మేనేజ్మెంట్ ను ఫర్ ఫెక్ట్ గా చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల తరహాలో రెబల్స్ హాడావిడి కనిపించకూడదన్నారు.

Advertisement

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన? కీలక ఆదేశాలు జారీ చేయనున్న సర్కారు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×