E-Paper
Advertisement

Congress Collapse : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. స్రవంతి డిపాజిట్ గల్లంతు..

Congress Collapse : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. స్రవంతి డిపాజిట్ గల్లంతు..
Advertisement

Congress Collapse : మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హోరాహోరీగా జరిగిన పోరులో హస్తం పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం మామూలు విషయం కాదు. బలమైన పాల్వాయి కుటుంబం నుంచి స్రవంతి బరిలో ఉండటం.. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మునుగోడులోనే మకాం వేసి విస్తృత ప్రచారం చేసినా కూడా.. చేతి గుర్తు నామమాత్రపు పోటీకే పరిమితం కావడం దారుణం అంటున్నారు.

సీనియర్ల వెన్నుపోటు.. రేవంత్ రెడ్డిపై కుట్రలే స్రవంతి ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. అలాంటి చోట మూడవ స్థానానికి పడిపోవడంతో పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నారు. ముందుండి గెలిపించాల్సిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రచార సమయంలో ఆస్ట్రేలియా వెళ్లిపోవడం.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని చెప్పడం బాగా డ్యామేజ్ చేసిందని అంటున్నారు. ఇక సీనియర్లంతా మునుగోడులో ముఖం చాటేసి.. పైపైన ప్రచారం చేయడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవహించింది. రేవంత్ రెడ్డి ఒక్కరే ఎంత గట్టిగా ఫైట్ చేసినా.. ఆయనకు తీవ్ర స్థాయిలో సహాయ నిరాకరణ ఎదురైంది.

Advertisement

కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీల డబ్బు, మద్యం, బలం ముందు హస్తం పార్టీ నిలువలేకపోయిందని అంటున్నారు. బలమైన నాయకుడైన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటంతో మెజార్టీ కార్యకర్తలు ఆయన వెంట వెళ్లిపోవడంతో హస్తం పార్టీ ఓటు బ్యాంకుకు గండిపడింది. మునుగోడు ఉప ఎన్నిక కారు, కమలం మధ్య పోరుగా చిత్రీకరించడంతో.. రేసులో నిలిచినా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇక పోలింగ్ రోజున పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్ ను కలిసినట్టు ఉన్న ఫేక్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా మైనస్ అయింది. ఇక ఓటర్లు ఆ రెండు పార్టీల వైపే చీలిపోగా.. కరుడుగట్టిన కాంగ్రెస్ ఓటర్లు మాత్రం హస్తం గుర్తుకు దన్నుగా ఉన్నారు. ఆ సంఖ్య స్వల్పంగా ఉండటంతో.. పాల్వాయి స్రవంతికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×