E-Paper
Advertisement

Hyderabad News: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ నేతల రియాక్షన్స్, విచారణలో అన్నీ తెలుస్తాయి

Hyderabad News: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కాంగ్రెస్ నేతల రియాక్షన్స్, విచారణలో అన్నీ తెలుస్తాయి
Advertisement

Hyderabad News: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై అధికార పార్టీ నేతలు స్పందించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొలుత రియాక్ట్ అయ్యారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే మాకు గౌరవం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది నేరం అని అన్నారు. దీనిపై పారదర్శకంగా విచారణ జరిగి అన్నివిషయాలు బయటకు వస్తాయన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు

Advertisement

తనతోపాటు చాలామంది వాంగ్మూలం ఇచ్చామన్నారు. అందులో భాగంగానే కేటీఆర్, హరీష్‌రావులకు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ వ్యవహారం జరిగినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి తెలియకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయరని అనుకుంటున్నానని తెలిపారు.

అన్నీ సిట్ విచారణలో తేలుతాయన్ననారు. ఫోన్ ట్యాపింగ్‌లో వాస్తవాలు బయటికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మాకు ఎవరిపై రాజకీయ కక్ష లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము 75 శాతం నుండి 90 శాతం గెలుస్తామన్నారు. టికెట్ల పంపిణీలో ఇంచార్జి మంత్రి, డీసీసీ ఆధ్వర్యంలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Advertisement

కాంగ్రెస్ నేతల రియాక్షన్స్, విచారణలో అన్నీ తెలుస్తాయి

ఆనాడు ప్రతిపక్ష నేతలు, పారిశ్రామికవేత్తలు, నటీనటుల ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై సిట్ వేసి విచారణ చేస్తున్నారని తెలిపారు. దాదాపు 500 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సమాచారం ఉందన్నారు. జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ పిలిచి విచారిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి, కొందరు మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు అంత సాహసం చేసే అవకాశం ఉందన్నారు. ఆనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే దాని ప్రకారం అధికారులు చేశారని తాము అనుకుంటున్నామని తెలిపారు. అంతవరకు ఎవర్నీ దోషులని భావించలేమన్నారు. రెండేన్నరేళ్ల తర్వాత రాజకీయ కక్ష అనేది ఎక్కడుంటుందన్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ మల్లు రవి రియాక్ట్ అయ్యారు. ఇదేమీ కొత్త విషయం కాదన్నారు. చట్టం ముందు అందరు సమానమే, ఎవరూ ఎక్కువ కాదన్నారు.

ALSO READ: యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం.. అసలు దొంగలు వారేనా?

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×