E-Paper
Advertisement

Medchal Politics: ఆలియాబాద్ లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్ల తొలగింపుపై ఆందోళన!

Medchal Politics: ఆలియాబాద్ లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్ల తొలగింపుపై ఆందోళన!
Advertisement

Medchal Politics:  ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆరోపించారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధి లో కాంగ్రెస్ ప్రచార రథం డీజే వైర్లను బీఆర్ఎస్ పార్టీ (Brs Party)  శ్రేణులు తొలగించారంటూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రోద్బలంతోనే డీజే వైర్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డి తదితర నేతలు ఆందోళనకు దిగారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Also Read: MLA defection case: ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్.. మూడు వారాలు వెనక్కి.. న్యాయస్థానంలో ఏం జరిగింది?

Advertisement

బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని సాగనివ్వం 

ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడే ఓ బీఆర్ఎస్ నేత ఇంట్లో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి,పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జీ రాగిడి లక్ష్మారెడ్డిలు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని సాగనివ్వమని హెచ్చరిస్తున్నారు.ఈ ఘటన కారణంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లకు చెందిన నాయకులు,కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.పోలీసు బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను సముదాయించేందుకు యత్నిస్తున్నారు.

Advertisement

Also Read: GHMC Offices: ఇష్టారాజ్యంగా అధికారుల విధి నిర్వహణ.. ఎపుడొస్తారో? ఎపుడు వెళ్లారో తెలియని పరిస్థితి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×