E-Paper
Advertisement

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!
Advertisement

SIR Process: స్వేచ్చ బ్యూరో: ఉమ్మడి మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ మున్సిపల్ 297, 298, 299 డివిజన్లలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సులభంగా కాకుండా అత్యంత కఠినంగా మార్చిందని మాజీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియ వెనుక కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా మద్దతు ఇచ్చే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను తగ్గించాలనే రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు.

43.6 శాతం పూర్తి..

మంగళవారం గుండ్లపోచంపల్లి ఓ ప్రైవేట్ ఫోమ్ హౌస్ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పై కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ, డివిజన్ అధ్యక్షులుతో హరివర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రజా సమస్యల పరిష్కారానికి అనుభవజ్ఞులైన నాయకత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే 43.6 శాతం పూర్తైందని పేర్కొన్నారు. ప్రతి ఓటు విలువైనదని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ వారి ఓటు హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతోందన్నారు.

Advertisement

Also read: NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

బీజేపీ కుట్ర..

బీజేపీ కుట్రలను ప్రజల్లో ఎండగట్టి తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గ డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, పర్యవేక్షణలో పార్టీ శ్రేణులు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందని హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో..

Advertisement

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉప అధ్యక్షుడు బాల్ రెడ్డి, జిల్లా నాయకులు మహేష్ గౌడ్, సత్యనారాయణ, ఓబీసీ సెల్ అధ్యక్షుడు రవి ముదిరాజ్,డివిజన్ అధ్యక్షులు చాప రాజు,మల్లేష్ గౌడ్, సురేందర్ ముదిరాజ్, ఎల్లంపేట్ మున్సిపల్ అధ్యక్షుడు విఘ్నేశ్వర రెడ్డి,మాజీ అధ్యక్షులు రమణ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, దేవా, కౌడే మహేష్ ,రంజిత్,తదితరులు పాల్గొన్నారు.

Also Read: KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×